News November 1, 2024
Flipkartలో సరికొత్త మోసం?
Flipkartలో జరుగుతోన్న ఓ మోసాన్ని కేశవ్ అనే వ్యక్తి లేవనెత్తారు. Mokobora కంపెనీకి చెందిన సూట్‌కేస్ ధరను ఆండ్రాయిడ్, iOSలలోని Flipkart యాప్‌లో కంపేర్ చేశారు. ఆండ్రాయిడ్‌లో దీని ధర రూ.4819 ఉండగా, iOSలో రూ.5499 ఉంది. ఒకే కంపెనీ బ్యాగుకూ ఎందుకీ వ్యత్యాసమని ఆయన మండిపడ్డారు. దీనిపై Flipkart స్పందిస్తూ.. ‘వివిధ అంశాల ఆధారంగా ధరలను విక్రేత నిర్ణయించడంతో కొన్నిసార్లు వ్యత్యాసం ఉంటుంది’ అని పేర్కొంది.
Similar News
News December 12, 2024
రాష్ట్ర పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
AP: రాష్ట్రంలో హెల్మెట్ నిబంధన అమలు కావట్లేదని పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ ధరించకపోవడం వల్ల 667 మంది మరణించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో హెల్మెట్ నిబంధన ఎందుకు అమలు చేయట్లేదు? అని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ మరణాలకు బాధ్యత ఎవరిది? అని సీరియస్ అయింది. దీనిపై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
News December 12, 2024
వాట్సాప్, FB సేవలు డౌన్.. స్పందించిన ‘మెటా’
FB, ఇన్‌స్టా, వాట్సాప్ సేవలు <<14854292>>డౌన్<<>> అవ్వడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఈ యాప్‌ల మాతృసంస్థ మెటా స్పందించింది. తమ అప్లికేషన్లను కొందరు వినియోగదారులు యాక్సెస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలిసిందని పేర్కొంది. సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగిందని, వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది. అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు కోరింది.
News December 12, 2024
400 బి.డాలర్ల సంపద దాటేసిన మస్క్
స్పేస్ ఎక్స్, టెస్లా CEO మస్క్ సంపద 400 బి.డాలర్లు దాటింది. దీంతో ఆయన ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు. స్పేస్‌ఎక్స్ ఇన్‌సైడర్ షేర్ ట్రేడింగ్, అగ్రరాజ్య ఎన్నికల్లో ఆయన మద్దతిచ్చిన ట్రంప్ విజయం సంపదను అమాంతం పెంచాయి. ప్రస్తుతం మస్క్ సంపద 439.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ సూచీ తెలిపింది. అమెరికా ఎన్నికల ముందు నుంచి ఇప్పటివరకు టెస్లా షేర్లు 65% పెరిగాయంది.