News August 8, 2024

15న SSLV-D3 ప్రయోగం

image

శ్రీహరికోట నుంచి ఈ నెల 15న ఉ.9.17 గంటలకు SSLV-D3 రాకెట్ ద్వారా EOS-08 శాటిలైట్‌ను ఇస్రో నింగిలోకి పంపనుంది. సముద్ర ఉపరితలంపై గాలులు, తేమ, హిమాలయాల్లో క్రియోస్పియర్, వరదలను ఎప్పటికప్పుడు గుర్తించి ఫొటోలను తీసి పంపడం ఈ ప్రయోగ లక్ష్యం. ఈ ఉప గ్రహం బరువు 175.5KGలు. ఇందులో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్, గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్-రిఫ్లెక్టోమెట్రీ, యూవీడోసిమీటర్ అనే 3 పేలోడ్లను అమర్చారు.

Similar News

News November 21, 2025

నవాబుపేట: కూతురి ప్రేమ వ్యవహారంతో తండ్రి ఆత్మహత్య

image

నవాబుపేట మండలం హన్మసానిపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కౌల్ల ఎల్లయ్య(40) కూతురు గౌతమి ఓ యువకుడిని ప్రేమించి అతనితో వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. గురువారం ఉదయం తన పొలంలోని చింతచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 21, 2025

ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

image

AP: రాష్ట్రంలో మావో అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్, మరో 51 మంది మావోయిస్టులు అరెస్టయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెలగపూడి సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. విజయవాడ పరిసరాల్లో మరింత మంది మావోలు ఉండొచ్చనే సమాచారంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

News November 21, 2025

మిస్‌ యూనివర్స్‌-2025 ఫాతిమా బాష్‌ గురించి తెలుసా?

image

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్-2025 పోటీల్లో “ఫాతిమా బాష్” విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. మెక్సికోలోని శాంటియాగో డి తెపా ప్రాంతానికి చెందిన ఫాతిమా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేశారు. స్కూల్‌లో చదువుతున్నప్పుడు డిస్లెక్సియా, హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడిన ఆమె వాటిని దాటుకొని అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా 121 దేశాల అందగత్తెలను దాటి మిస్ యూనివర్స్‌గా నిలిచారు.