News August 8, 2024
15న SSLV-D3 ప్రయోగం
శ్రీహరికోట నుంచి ఈ నెల 15న ఉ.9.17 గంటలకు SSLV-D3 రాకెట్ ద్వారా EOS-08 శాటిలైట్‌ను ఇస్రో నింగిలోకి పంపనుంది. సముద్ర ఉపరితలంపై గాలులు, తేమ, హిమాలయాల్లో క్రియోస్పియర్, వరదలను ఎప్పటికప్పుడు గుర్తించి ఫొటోలను తీసి పంపడం ఈ ప్రయోగ లక్ష్యం. ఈ ఉప గ్రహం బరువు 175.5KGలు. ఇందులో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్, గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్-రిఫ్లెక్టోమెట్రీ, యూవీడోసిమీటర్ అనే 3 పేలోడ్లను అమర్చారు.
Similar News
News December 12, 2024
క్లీంకార ఇప్పుడెలా ఉందో చూడండి!
రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార చూస్తుండగానే పెరిగిపోయింది. తన తాతతో క్లీంకార ఆలయాన్ని సందర్శించిన ఫొటోను ఉపాసన షేర్ చేశారు. ‘ఈరోజు మా హాస్పిటల్ టెంపుల్‌లోని వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాల్లో తన ముత్తాతలతో కలిసి క్లీంకార పాల్గొంది. తాత చేతుల్లో తనను చూస్తుంటే నా బాల్యం గుర్తొస్తోంది’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, మెగా ప్రిన్సెస్ ఫేస్ కనిపించకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు.
News December 12, 2024
ప్రపంచంలోనే అరుదైన రక్తం ఇదే!
ప్రపంచంలో పలు రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నప్పటికీ Rh-null అనేది అరుదైన రక్త సమూహంగా పరిగణిస్తుంటారు. దీనిని ‘గోల్డెన్ బ్లడ్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 కంటే తక్కువ మంది మాత్రమే ఈ ప్రత్యేకమైన రక్త వర్గాన్ని కలిగి ఉన్నారు. ఇది అరుదుగా ఉండటం వల్ల దీనిని విలువైనదిగా భావిస్తారు. యాంటీజెన్స్ ఉండవు కాబట్టి Rh వర్గం వారికి వినియోగించాల్సి వచ్చినపుడు దీని మ్యాచ్‌ను కనుగొనడం చాలా కష్టం.
News December 12, 2024
100 రోజుల యాక్షన్ ప్లాన్: లోకేశ్
ఏపీలో మోడల్ విద్యావ్యవస్థ రూపకల్పనకు అధికారులంతా నడుంబిగించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ‘ప్రభుత్వ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్ పెరగాలి. జీరో డ్రాపవుట్స్ మా లక్ష్యం. రానున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై అధికారులు ఫోకస్ పెట్టాలి. చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పోషకవిలువలు కలిగిన ఆహారం అందించాలి. యాంటీ డ్రగ్స్ అవగాహన కల్పించాలి’ అని కలెక్టర్ల సదస్సులో ఆదేశించారు.