News July 13, 2024

రాజ్‌తరుణ్ ఆచూకీ కనిపెట్టాలని కోరా: లావణ్య

image

TG: హీరో రాజ్‌తరుణ్‌పై నమోదైన కేసులో భాగంగా ఫిర్యాదు చేసిన లావణ్య స్టేట్‌మెంట్‌ను HYD నార్సింగి పోలీసులు రికార్డ్ చేశారు. 4 గంటల పాటు వివిధ అంశాలపై ఆమె నుంచి సమాచారం సేకరించారు. సోమవారం మరోసారి విచారణకు హాజరవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా రాజ్‌తరుణ్ ఆచూకీ తెలపాలని పోలీసులను కోరినట్లు లావణ్య వెల్లడించారు.

Similar News

News December 18, 2025

ESIC హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

<>ESIC<<>>, హాస్పిటల్ నోయిడా 21 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు DEC 24న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి MD, MS, DNB, M.Ch, DrNB, DM, MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.2,22,543, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,47,986, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,27,141 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

News December 18, 2025

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.330 పెరిగి రూ.1,34,840కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 ఎగబాకి రూ.1,23,600 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,24,000కు చేరింది. వెండి ధర రెండ్రోజుల్లోనే రూ.13వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 18, 2025

పొగచూరిన ఢిల్లీ.. విమానాలు, రైళ్లు ఆలస్యం

image

ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరాల్సిన 40 విమానాలు ఆలస్యమయ్యాయి. అటు ఫాగ్ వల్ల 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డుపై వచ్చిపోయే వాహనాలేవీ కనిపించడంలేదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రయాణికులు నెమ్మదిగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా నిన్న లక్నోలో పొగ మంచు వల్ల భారత్-సౌతాఫ్రికా టీ20 మ్యాచ్ కూడా రద్దయిన విషయం తెలిసిందే.