News July 13, 2024

రాజ్‌తరుణ్ ఆచూకీ కనిపెట్టాలని కోరా: లావణ్య

image

TG: హీరో రాజ్‌తరుణ్‌పై నమోదైన కేసులో భాగంగా ఫిర్యాదు చేసిన లావణ్య స్టేట్‌మెంట్‌ను HYD నార్సింగి పోలీసులు రికార్డ్ చేశారు. 4 గంటల పాటు వివిధ అంశాలపై ఆమె నుంచి సమాచారం సేకరించారు. సోమవారం మరోసారి విచారణకు హాజరవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా రాజ్‌తరుణ్ ఆచూకీ తెలపాలని పోలీసులను కోరినట్లు లావణ్య వెల్లడించారు.

Similar News

News October 16, 2024

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

image

TG: ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. జడ్జి అందుబాటులో లేకపోవడంతో నవంబర్ 14కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో రేవంత్‌ను ఈడీ ఏ1 నిందితుడిగా పేర్కొంది. ఆయన రూ.50 లక్షల అక్రమాలకు పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొంది.

News October 16, 2024

రేణిగుంట విమానాశ్రయంలో వరద.. విమానం చెన్నైకి మళ్లింపు

image

AP: హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వెళ్తున్న విమానాన్ని చెన్నైకి దారి మళ్లించారు. తిరుపతి జిల్లాలో భారీ వర్షాలతో రేణిగుంట విమానాశ్రయం రన్‌వే పైకి నీళ్లు చేరాయి. ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ఆ విమానాన్ని చెన్నైకి మళ్లించారు.

News October 16, 2024

విజయం కోసం పేర్లు మార్చుకోవాల్సిందేనా?

image

సినీ ప్రముఖులు సైతం న్యూమరాలజీని ఫాలో అవుతుంటారు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడం, స్టార్‌గా గుర్తింపు రాకపోవడం తదితర కారణాలతో పేర్లలో మార్పులు, చేర్పులు చేసుకున్న నటీనటులున్నారు. ఇటీవలే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన పేరును సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్న విషయం తెలిసిందే. గతంలోనూ లక్ష్మీ రాయ్ – రాయ్ లక్ష్మీగా, కిచ్చా సుదీప్ – సుదీపగా, Sundeep Kishan – Sundeep Kishnగా పేరు మార్చుకున్నారు.