News February 16, 2025

మహారాష్ట్రలో లవ్ జిహాద్ నియంత్రణకు చట్టం!

image

బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్ నియంత్రణ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకు ఏడుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. DGP అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో న్యాయ, శిశు, మైనార్టీ, సామాజిక శాఖల సెక్రటరీలు, హోంశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. లవ్ జిహాద్‌ను అరికట్టడానికి ఏం చేయాలన్నదానిపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

Similar News

News March 28, 2025

ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు

image

260వ ర్యాంకు- దివి మురళి.. దివీస్ ($ 10B)
600- P పిచ్చిరెడ్డి.. MEIL ($5.8B)
625- PV కృష్ణారెడ్డి.. MEIL ($5.6B)
1122- ప్రతాప్ సి.రెడ్డి.. అపోలో హస్పిటల్స్ ($3.3B)
1122- PV రాంప్రసాదరెడ్డి.. అరబిందో ఫార్మా ($3.3B)
1198- B పార్థసారథిరెడ్డి.. హెటిరో ల్యాబ్స్ ($3.1B)
1624- K సతీశ్ రెడ్డి.. డాక్టర్ రెడ్డీస్ ($2.3B)
1796- M సత్యనారాయణరెడ్డి.. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ ($2.1B)

News March 28, 2025

రోడ్లపై నమాజ్ చేస్తే పాస్‌పోర్ట్, లైసెన్స్ రద్దు: UP పోలీసులు

image

యూపీలో ముస్లింలకు అక్కడి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్లపై నమాజ్ చేయొద్దని తేల్చిచెప్పారు. అలాంటి పనులకు ఎవరైనా పాల్పడితే వారి పాస్‌పోర్టును, డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ‘ఈద్ ప్రార్థనల్ని మసీదులు లేదా ఈద్గాల్లోనే చేయాలి. రోడ్లపై చేసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

News March 28, 2025

IPL: ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయాయ్!

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలై 18 ఏళ్లు పూర్తవుతోంది. అయితే, ఈ టోర్నీలో కొన్ని టీమ్స్ మెరుపులా వచ్చి అభిమానుల ప్రేమను సొంతం చేసుకొని పలు కారణాలతో రద్దయ్యాయి. అవేంటో తెలుసుకుందాం. డెక్కన్ ఛార్జర్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, గుజరాత్ లయన్స్, పుణే వారియర్స్ ఇండియా, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్లు కొన్ని సీజన్లకే పరిమితం అయ్యాయి. ఇందులో ఏ టీమ్‌కు మీరు సపోర్ట్ చేసేవారు? COMMENT

error: Content is protected !!