News May 19, 2024

స్కూల్ ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం

image

TG: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురానున్నట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం తెలిపారు. 2025-26లో ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు విద్యాశాఖపై రేపు CM రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. జూన్‌లో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు, VCల నియామకాలు, ఇతర అంశాలపై సమీక్షిస్తారని సమాచారం.

Similar News

News November 27, 2025

సినిమా అప్డేట్స్

image

* మహేశ్ బాబు అన్న కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా తెరకెక్కే తొలి చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ టైటిల్ ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్. దీనికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.
* రజినీకాంత్ జైలర్-2 సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
* రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న ‘ధురంధర్’ మూవీ రన్‌టైమ్ 3.32 గంటలని తెలుస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.

News November 27, 2025

BREAKING: హైకోర్టు కీలక ఉత్తర్వులు

image

TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. వారి నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. 1032 పోస్టులకు 2015లో నోటిఫికేషన్ వచ్చింది. అనేక న్యాయ వివాదాల అనంతరం 2019లో ఎంపిక జాబితాను TGPSC విడుదల చేసింది. అయితే మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయంటూ ఆ నియామకాలను సింగిల్ బెంచ్ రద్దు చేసింది.

News November 27, 2025

వారి కూతుళ్లపై కామెంట్స్.. IASకు నోటీసులు

image

బ్రాహ్మణుల కూతుళ్లపై <<18384712>>వివాదాస్పద<<>> కామెంట్లు చేసిన ఐఏఎస్ సంతోశ్ వర్మకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం షోకాజ్ నోటీసులిచ్చింది. IAS అధికారుల గౌరవం, ప్రవర్తనకు విరుద్ధంగా ఆయన కామెంట్లు ఉన్నాయని పేర్కొంది. ‘సంతోశ్ చర్యలు ఏకపక్షం, తీవ్రమైన దుష్ప్రవర్తన కిందికి వస్తాయి. ఆయన IAS రూల్స్(కండక్ట్)-1967ను ఉల్లంఘించారు. సంతోశ్ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణాచర్యలను ఎదుర్కోవాల్సిందే’ అని స్పష్టం చేసింది.