News May 19, 2024
స్కూల్ ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
TG: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురానున్నట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం తెలిపారు. 2025-26లో ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు విద్యాశాఖపై రేపు CM రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. జూన్‌లో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు, VCల నియామకాలు, ఇతర అంశాలపై సమీక్షిస్తారని సమాచారం.
Similar News
News December 6, 2024
ప్రజా తీర్పు కదా! ఐదేళ్లూ పదవిలో ఉంటా: మేక్రాన్
ప్రజలు తనకు ఐదేళ్లు అధికారం ఇచ్చారని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మేక్రాన్ అన్నారు. ఏదేమైనా పూర్తికాలం పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. అన్ని పార్టీలకు నచ్చే PM అభ్యర్థిని త్వరలోనే నియమిస్తానన్నారు. అవిశ్వాస తీర్మానంతో PM మైకేల్ బెర్నియర్ పదవీచ్యుతుడయ్యారు. పార్లమెంటరీ ఆమోదం లేకుండా స్పెషల్ పవర్ ఉపయోగించి బడ్జెట్‌పై చర్యలు తీసుకోవడంతో విపక్షాలు ఏకమై అవిశ్వాసం పెట్టాయి.
News December 6, 2024
ఈ నెల 10న కలెక్టరేట్ల ముట్టడి
TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 10న కలెక్టరేట్ల ముట్టడికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బకాయిల విడుదలకు అనుకూలంగా ఉన్నా, ఆర్థిక శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క బిల్లు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.
News December 6, 2024
కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బ్యాడ్ న్యూస్
AP: కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ సంక్రాంతికి పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 2 నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందని వార్తలు వచ్చినా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. మరోవైపు సివిల్ సప్లైస్ శాఖ మాత్రం తమ వైపు ఎలాంటి ఆటంకాలు లేవని చెబుతోంది. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటోంది.