News January 8, 2025
KTRతో పాటు లాయర్ కూర్చోరాదు: HC
లాయర్‌తో ACB విచారణకు హాజరు అయ్యేందుకు అనుమతించాలన్న KTR వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. లాయర్‌ను ఆయనతో పాటు కూర్చోబెట్టలేమని స్పష్టం చేసింది. దూరంగా ఉండి లాయర్ గమనించేందుకు మాత్రం పర్మిషన్ ఇస్తామని KTR లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణలో తెలిపింది. వెంట వెళ్లే ముగ్గురు లాయర్ల పేర్లను ఇవ్వాలని మాజీ మంత్రి కౌన్సిల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను సాయంత్రం గం.4కు వాయిదా వేసింది.
Similar News
News January 26, 2025
టీ20ల్లో అరుదు
SA టీ20లో పార్ల్ రాయల్స్ సంచలనం నమోదు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో కేవలం స్పిన్నర్లతోనే ఆ జట్టు బౌలింగ్ చేయించింది. ఈ లీగ్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ 140 పరుగులు చేయగా, ప్రిటోరియా 129కే పరిమితమైంది. దీంతో PR 11 పరుగుల తేడాతో విజయం సాధించగా ప్లేఆఫ్‌కు దూసుకెళ్లింది.
News January 26, 2025
బాలయ్యకు అభినందనల వెల్లువ
పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. సినీనటులు మహేశ్ బాబు, రాజమౌళి, విజయ్ దేవరకొండ, వెంకటేశ్, అల్లు అరవింద్, వరలక్ష్మీ శరత్ కుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, శ్రీభరత్, కల్వకుంట్ల కవిత, సీఎం రమేశ్, నారా భువనేశ్వరి, అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
News January 26, 2025
జనవరి 26: చరిత్రలో ఈరోజు
1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ
1957: జమ్మూ కశ్మీర్ రాష్ట్ర అవతరణ
1957: భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ జననం
1968: సినీనటుడు రవితేజ జననం
1986: హీరో నవదీప్ జననం
2001: గుజరాత్లో భూకంపం.. 20 వేల మందికిపైగా దుర్మరణం
2010: సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మరణం
భారత గణతంత్ర దినోత్సవం