News September 12, 2024
లేఆఫ్‌లు కొనసాగుతాయంటున్న ‘డెల్’
తమ సంస్థలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని ప్రముఖ టెక్ కంపెనీ డెల్ తెలిపింది. పర్సనల్ కంప్యూటర్‌లకు డిమాండ్ పెరగకపోవడం, ఏఐ కోసం ఆప్టిమైజ్ చేసిన సర్వర్‌ల అమ్మకాలు లాభదాయకంగా లేవన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఖర్చుల నియంత్రణ కోసం లేఆఫ్‌లు తప్పవని చెప్పింది. కాగా గత నెలలో డెల్ కంపెనీ 12,500 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపింది.
Similar News
News October 3, 2024
రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 78 రోజుల బోనస్ ప్రతిపాదనలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం రైల్వే శాఖలో పనిచేస్తున్న సుమారు 11.72 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు పనితీరు ఆధారిత (Productivity Linked Bonus) బోనస్ లభించనుంది. అర్హత ఉన్న ప్రతి రైల్వే ఉద్యోగికి 78 రోజులకుగానూ గరిష్ఠంగా రూ.17,951 చెల్లించనున్నారు.
News October 3, 2024
ఆ విషయంలో గాంధీ తరువాత మోదీనే: అమిత్ షా
గుజరాత్‌కు చెందిన ఇద్దరు పుత్రులు మహాత్మా గాంధీ, ప్రధాని మోదీ మాత్రమే దేశ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత పౌరుల ఆరోగ్యం, ఆయుర్దాయం గురించి ఆందోళన చెందుతూ పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణంపై ఎర్రకోట నుంచి మోదీ విజ్ఞప్తి చేశారన్నారు. గాంధీ తర్వాత పరిశుభ్రత ప్రాథమిక అవసరాన్ని వివరించిన 2వ జాతీయ నాయకుడు మోదీ అని పేర్కొన్నారు.
News October 3, 2024
పవన్‌ను చూస్తుంటే ‘కెవ్వు కేక’ సాంగ్ గుర్తొస్తుంది: భూమన
AP: వైసీపీ చీఫ్ జగన్ మీద ఇష్టం వచ్చినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ రాజకీయ ప్రేలాపనలు చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ దుయ్యబట్టారు. సనాతన ధర్మాన్ని ఆయన రక్షిస్తున్నట్లుగా పవన స్వాముల మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడటం వెనుక వేరే అజెండా ఉందన్నారు. పవన్ స్వామిని చూస్తుంటే ‘కెవ్వు కేక’ సాంగ్ గుర్తొస్తుందన్నారు. ఆయన పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.