News February 8, 2025
మెటాలో 3,000 మందికి లేఆఫ్స్?

టెక్ దిగ్గజం మెటా భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 10 నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు సమాచారం. సుమారు 12 దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. జాబ్ కోల్పోయినవారికి సెవెరెన్స్ ప్యాకేజీ ఇస్తారని టాక్. పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులను మాత్రమే తొలగించనున్నట్లు మెటా గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News March 28, 2025
‘మ్యాడ్ స్క్వేర్’ పబ్లిక్ టాక్

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మ్యాడ్ స్క్వేర్’ థియేటర్లలో విడుదలైంది. సినిమాలో డైలాగ్స్, కామెడీ బాగున్నాయని, లడ్డూ క్యారెక్టర్ విపరీతంగా నవ్విస్తుందని మూవీ చూసిన వాళ్లు చెబుతున్నారు. యూత్ ఆడియన్స్‌కు నచ్చే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని, స్పెషల్ సాంగ్ బాగుందని అంటున్నారు. అక్కడక్కడ సాగదీతగా, బోరింగ్ ఫీల్ కలుగుతుందని చెబుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ
News March 28, 2025
ముస్లింలందరూ నల్ల బ్యాండ్ ధరించాలి: AIMPLB

వక్ఫ్ సవరణ బిల్లు 2024కు వ్యతిరేకంగా ముస్లింలందరూ ఇవాళ శాంతియుత నిరసన చేపట్టాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) పిలుపునిచ్చింది. జుముఅతుల్-విదా రోజున (రంజాన్ నెలలో చివరి శుక్రవారం) మసీదులకు వచ్చేటప్పుడు చేతికి నల్ల బ్యాండ్ ధరించాలని పేర్కొంది. ఢిల్లీ, పట్నాలో ఇప్పటికే నిరసన కార్యక్రమాలు చేపట్టామని, ఈనెల 29న విజయవాడలో నిరసనకు దిగనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
News March 28, 2025
కుప్పకూలిన భవనం.. మరో మృతదేహం లభ్యం

TG: భద్రాచలంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా మరో మృతదేహాన్ని సిబ్బంది వెలికితీశారు. అతడిని భద్రాచలానికి చెందిన ఉపేందర్(38)గా గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మరణించారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.