News July 4, 2024

హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై రష్యా, జపాన్ అధినేతల సంతాపం

image

హాథ్రస్ <<13555518>>తొక్కిసలాట <<>>ఘటనలో 121 మంది చనిపోవడంపై రష్యా, జపాన్ దేశాల అధినేతలు స్పందించారు. ‘ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన విడుదల చేశారు. జపాన్ ప్రధాని పుమియో కిషిద మృతులకు సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని తమ ప్రభుత్వం పార్థిస్తుందని పేర్కొన్నారు.

Similar News

News November 3, 2025

ఇంటర్నేషనల్ మ్యాచే ఆడలేదు.. WC నెగ్గారు

image

భారత మహిళల <<18182320>>క్రికెట్<<>> చరిత్రలో హెడ్ కోచ్ ‘అమోల్ ముజుందర్’ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. భారత్ WC లిఫ్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఈ ముంబై బోర్న్ డొమెస్టిక్ స్టార్.. ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచూ ఆడలేదు. టీమ్ ఇండియాకి ప్రాతినిధ్యం వహించాలన్న తన కలను ఈ విధంగా సాకారం చేసుకున్నారు. ‘క్రెడిట్ అంతా మహిళలకే దక్కుతుంది. ఓటములతో మేము కుంగి పోలేదు. ఇవాళ మా లక్ష్యాన్ని సాధించాం’ అని ముజుందర్ తెలిపారు.

News November 3, 2025

సర్పాలు, నాగులు ఒకటి కాదా?

image

పురాణాల ప్రకారం.. సర్పాలు, నాగులు వేర్వేరని పండితులు చెబుతున్నారు. సర్పాలంటే భూమిపై తిరిగే పాములని, నాగులంటే దైవ స్వరూపాలని అంటున్నారు. ‘సర్పాలు విషపూరితమైనవి. నాగులు విషరహితమైనవి. నాగులు కోరుకున్న రూపాన్ని ధరించగలవు. అలాగే వీటికి ప్రత్యేకంగా ‘నాగ లోకం’ కూడా ఉంది. ఇవి గాలిని పీల్చి జీవిస్తాయి. కానీ సర్పాలు నేల/నీటిలో మాత్రమే ఉంటాయి. ఇవి నేలను అంటిపెట్టుకొని పాకుతాయి’ అని వివరిస్తున్నారు.

News November 3, 2025

రూ.500కే రూ.16 లక్షల ప్లాటు గెలిచింది

image

TG: లాటరీలో ఓ 10 నెలల చిన్నారిని అదృష్టం వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో తీసిన లక్కీ డ్రాలో రూ.500కే ఏకంగా రూ.16 లక్షల విలువైన ప్లాటును గెలుచుకుంది. రామ్ బ్రహ్మచారి అనే వ్యక్తి 66 గజాల ప్లాటుకు లక్కీ డ్రా నిర్వహించారు. శంకర్ అనే వ్యక్తి ఫ్యామిలీ పేరుతో 4 కూపన్లు తీసుకోగా.. 2307 అనే నంబరుతో కుమార్తె హన్సికకు ఈ బహుమతి దక్కింది. రూ.500కే ప్లాటు దక్కడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.