News March 27, 2025
‘తెలుగు నేర్చుకో..’ అక్బరుద్దీన్ ఒవైసీపై మాజీ ఐఏఎస్ ఫైర్

TG: ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే <<15896404>>అక్బరుద్దీన్‌పై<<>> మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ ఫైరయ్యారు. ‘మంత్రి సీతక్కకు హిందీ రాదు సరే.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన నీకు తెలుగు ఎందుకు రాదు?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మాట్లాడే తొలి అధికార భాష తెలుగును నేర్చుకోవాలనే బాధ్యత ఉండాలని హితవు పలికారు. తెలుగు రానప్పుడు సభ్యులు లేవనెత్తే సమస్యలు ఎలా అర్థమవుతాయని దుయ్యబట్టారు.
Similar News
News March 30, 2025
నితీశ్ రాణా విధ్వంసం..

IPL-2025: చెన్నైతో జరుగుతోన్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ జైస్వాల్ (4) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా బౌండరీలతో వీరవిహారం చేస్తున్నారు. 22 బంతుల్లోనే 4 సిక్సర్లు, 7 ఫోర్లతో 58* రన్స్ చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ స్కోర్ 6 ఓవర్లలో 79/1గా ఉంది.
News March 30, 2025
సన్న బియ్యం పథకాన్ని ఎవరూ రద్దు చేయలేరు: CM రేవంత్

TG: సన్న బియ్యం పథకాన్ని ఎవరూ రద్దు చేయలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకం కొనసాగుతుందని తెలిపారు. కేసీఆర్ హయాంలో రూ.11వేల కోట్ల రుణమాఫీ చేస్తే, తాము అధికారంలోకి వచ్చాక ఆర్నెల్లలోనే రూ.25 వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర తమదని చెప్పారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తామని రేవంత్ పేర్కొన్నారు.
News March 30, 2025
66 ఏళ్ల వయసులో 10వ బిడ్డకు జన్మ!

10మంది పిల్లలకు జన్మనివ్వడమంటేనే కష్టం. ఆ పదో బిడ్డను 66ఏళ్ల వయసులో ప్రసవిస్తే..? జర్మనీకి చెందిన ఆలెగ్జాండ్రా హెల్డెబ్రాండ్ ఇదే ఘనత సాధించారు. ఎటువంటి కృత్రిమ పద్ధతులూ లేకుండా ఆమె సహజంగానే తల్లి కావడం, ప్రసవించడం విశేషం. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారని బెర్లిన్‌లోని చారైట్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అలెగ్జాండ్రా తొలి బిడ్డకు ఇప్పుడు 50 ఏళ్లు కావడం ఆసక్తికరం.