News March 27, 2025

‘తెలుగు నేర్చుకో..’ అక్బరుద్దీన్ ఒవైసీపై మాజీ ఐఏఎస్ ఫైర్

image

TG: ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే <<15896404>>అక్బరుద్దీన్‌పై<<>> మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ ఫైరయ్యారు. ‘మంత్రి సీతక్కకు హిందీ రాదు సరే.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన నీకు తెలుగు ఎందుకు రాదు?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మాట్లాడే తొలి అధికార భాష తెలుగును నేర్చుకోవాలనే బాధ్యత ఉండాలని హితవు పలికారు. తెలుగు రానప్పుడు సభ్యులు లేవనెత్తే సమస్యలు ఎలా అర్థమవుతాయని దుయ్యబట్టారు.

Similar News

News April 20, 2025

YELLOW ALERT: ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎండలతో పాటు అకాల వర్షాలు కొనసాగే అవకాశం ఉందని IMD వెల్లడించింది. APలో ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు, ఉ.గో, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. TGలో ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, HYD, మేడ్చల్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News April 20, 2025

GOVT ఉద్యోగాల్లో వారికి 3% రిజర్వేషన్లు

image

AP: ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్‌ను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో పతకాలు సాధిస్తే పోటీ పరీక్షలు లేకుండానే ఉద్యోగం ఇవ్వనుంది. అన్ని ప్రభుత్వ విభాగాలు, DSC, యూనిఫాం శాఖలకూ ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. గతంలో ఉన్న పదేళ్ల కాలపరిమితిని ఎత్తేసింది. అర్హత, వయసు ఉంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా పతకాలు సాధించిన వారంతా అర్హులే.

News April 20, 2025

వచ్చే సంక్రాంతికి అఖండ-2?

image

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలకృష్ణ నటిస్తున్న అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడనున్నట్లు సమాచారం. తొలుత ఈ ఏడాది సెప్టెంబర్ 25కి ప్లాన్ చేయగా ఆలోపు సినిమా షూటింగ్, VFX వర్క్స్ పూర్తయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ యోచిస్తున్నట్లు టాక్. కాగా బాలయ్య- బోయపాటి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనే వార్తలను సినీ వర్గాలు <<16051406>>ఖండించిన<<>> విషయం తెలిసిందే.

error: Content is protected !!