News March 29, 2024

పోలింగ్ రోజున సరిహద్దు రాష్ట్రాల ఓటర్లకూ వేతనంతో కూడిన సెలవు

image

TG: రాష్ట్రంలోని 17 MP, సికింద్రాబాద్ కంటోన్మెంట్ MLA స్థానానికి పోలింగ్ జరిగే మే 13న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఉండనుంది. తెలంగాణలో ఉంటున్న AP ఓటర్లకూ ఈ సెలవు వర్తిస్తుంది. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్(APR 19), మహారాష్ట్ర(APR 19, 26), కర్ణాటక(మే 7)లో వేర్వేరు రోజుల్లో పోలింగ్ ఉంది. తెలంగాణలో పనిచేస్తున్న ఆ రాష్ట్రాల వారికీ వేతనంతో కూడిన సెలవు ఇస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది.

Similar News

News January 8, 2026

రైళ్ల శుభ్రతపై భారీగా ఫిర్యాదులు

image

ట్రైన్లలో కోచ్‌ల శుభ్రత, బెడ్‌ రోల్స్‌కు సంబంధించి Rail Madad యాప్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో 8,758 ఫిర్యాదులు నమోదు కాగా, అక్టోబర్ (13,406), నవంబర్‌ (13,196)లో సుమారు 50% పెరుగుదల కనిపించింది. అదే సమయంలో ‘సంతృప్తికర’ ఫీడ్‌బ్యాక్‌లు కూడా తగ్గాయి. ఈ పరిస్థితిని గమనించిన రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోన్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు వేగంగా పరిష్కారమయ్యేలా చూడాలని సూచించింది.

News January 8, 2026

చిన్నారుల దత్తత.. అసలు విషయం చెప్పిన శ్రీలీల

image

నటి శ్రీలీల 2022లో గురు, శోభిత అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. దీనికి గల కారణాలను ‘పరాశక్తి’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా వెల్లడించారు. చిన్న వయసులోనే పిల్లలను దత్తత తీసుకోవడానికి ప్రేరణ ఇచ్చింది ఒక దర్శకుడు అని తెలిపారు. “కన్నడలో ఓ సినిమా చేసేటప్పుడు ఆయన నన్ను అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడి పిల్లలు నాకు బాగా దగ్గరయ్యారు. ఇద్దరని దత్తత తీసుకున్నాను” అని చెప్పారు.

News January 8, 2026

గ్రోక్ వివాదం.. కేంద్రానికి ‘X’ నివేదిక

image

‘X’లో <<18744769>>అశ్లీల కంటెంట్<<>> అంశం కేంద్రానికి చేరిన విషయం తెలిసిందే. అలాంటి కంటెంట్‌ను తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. తాజాగా బుధవారం సాయంత్రానికి ఎక్స్ తన రిపోర్టును సమర్పించింది. దీనిని ఐటీ శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. Grokను దుర్వినియోగం చేసే యూజర్లపై కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే సదరు సంస్థ హెచ్చరించింది.