News March 29, 2024
పోలింగ్ రోజున సరిహద్దు రాష్ట్రాల ఓటర్లకూ వేతనంతో కూడిన సెలవు
TG: రాష్ట్రంలోని 17 MP, సికింద్రాబాద్ కంటోన్మెంట్ MLA స్థానానికి పోలింగ్ జరిగే మే 13న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఉండనుంది. తెలంగాణలో ఉంటున్న AP ఓటర్లకూ ఈ సెలవు వర్తిస్తుంది. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్(APR 19), మహారాష్ట్ర(APR 19, 26), కర్ణాటక(మే 7)లో వేర్వేరు రోజుల్లో పోలింగ్ ఉంది. తెలంగాణలో పనిచేస్తున్న ఆ రాష్ట్రాల వారికీ వేతనంతో కూడిన సెలవు ఇస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది.
Similar News
News January 25, 2025
VSR రాజీనామాకు ఆమోదం.. బులెటిన్ రిలీజ్
AP: రాజ్యసభ ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి చేసిన రాజీనామాను ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. VSR రాజీనామాతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ ఏర్పడింది. కాగా రాజకీయాలకు పూర్తిగా దూరమవుతున్నట్లు నిన్న విజయసాయి ప్రకటించిన సంగతి తెలిసిందే.
News January 25, 2025
రోహిత్‌కు గాయమైతే భారత్‌కు సమస్యే: అశ్విన్
ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడితే భారత జట్టు కష్టాల్లో పడుతుందని మాజీ క్రికెటర్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ గాయపడితే వైస్ కెప్టెన్‌గా ఎంపికైన గిల్ కెప్టెన్సీ చేయాలి. కానీ అతడికి అనుభవం లేదు. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. రోహిత్, కోహ్లీ, బుమ్రా లేకపోతే టీమ్‌ని నడిపించే వాళ్లెవరూ కనిపించడం లేదు. టీమ్ ఇండియాలో సమర్థమైన కెప్టెన్‌ల కొరత ఉంది’ అని తన యూట్యూబ్ వీడియోలో వివరించారు.
News January 25, 2025
మీర్‌పేట్ ఘటన.. పోలీసులకు సవాల్
HYDలో భార్యను నరికి ముక్కలుగా ఉడికించిన <<15250914>>కేసు <<>>దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. నిందితుడు చెప్పినట్టు మృతదేహాన్ని బూడిదగా మార్చి చెరువులో వేసినట్లైతే అది నిరూపించడం, ఘటనా స్థలంలో దొరికిన శాంపిల్స్ ల్యాబ్‌కు పంపి అవి మనిషివని నిరూపించడం పెద్ద టాస్కే. అది మాధవి శరీరమని నిరూపించేలా ఆమె పేరెంట్స్, పిల్లల DNA శాంపిల్స్ విశ్లేషించాలి. ఇందుకోసం టాప్ ప్రొఫెషనల్స్‌ను పోలీసులు సంప్రదిస్తున్నారు.