News May 12, 2024
కాలు దువ్వుతున్న కరెన్సీ కట్టలు

ఎన్నికల కదనరంగంలో కరెన్సీ కట్టలు కాలుదువ్వుతున్నాయి. సంచుల కొద్దీ డబ్బు పట్టుబడుతుండగా.. నియోజకవర్గాల్లో యథేచ్ఛగా డబ్బు పంపిణీ సాగుతోంది. చాలా ప్రాంతాల్లో అభ్యర్థులు డబ్బుని మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు. మద్యం, ఓటర్లకు డబ్బు, ప్రచార ఖర్చులు వెరసి.. ఒక్కో సెగ్మెంట్‌కి రూ.70 కోట్ల- రూ.100 కోట్ల వరకు అవుతోందట. AP ఎన్నికలకు పెడుతున్న ఖర్చు దేశ చరిత్రలోనే ఎక్కడా లేదనే వాదన వినిపిస్తోంది.
Similar News
News February 18, 2025
అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం

AP: కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఆశ్రమంలో ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. స్థానికులు వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
బీజేపీ ఆదాయం రూ.4,340 కోట్లు

2023-24లో దేశంలోని ఆరు జాతీయ పార్టీలకు వివిధ మార్గాల ద్వారా రూ.5,820 కోట్ల ఆదాయం వచ్చినట్లు ADR వెల్లడించింది. ఇందులో 74.56%(₹4,340Cr) వాటా బీజేపీకే చేరిందని తెలిపింది. ఆ తర్వాత కాంగ్రెస్(₹1,225Cr), సీపీఎం(₹167 కోట్లు), బీఎస్పీ(₹64Cr), ఆప్(₹22Cr), నేషనల్ పీపుల్స్ పార్టీ(₹22L) ఉన్నాయంది. 2022-23తో పోలిస్తే బీజేపీ ఆదాయం 83.85%, కాంగ్రెస్ ఆదాయం 170.82% పెరిగినట్లు పేర్కొంది.
News February 18, 2025
SSMB29 రెండో షెడ్యూల్ షురూ

రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్ బాబు నటిస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం SSMB29 షూటింగ్ రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్ శివారులో నిర్మించిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సోదరుడి వివాహం కోసం బ్రేక్ తీసుకున్న ప్రియాంకా చోప్రా మళ్లీ సెట్‌లో అడుగుపెట్టారు. మరోవైపు ఈ వేసవిలో విదేశాల్లో షూటింగ్‌కు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.