News September 26, 2024
KTRకు లీగల్ నోటీసులు

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు సృజన్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. తనపై ‘అమృత్’ టెండర్ల విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక అమృత్ స్కీమ్ టెండర్లలో అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో రూ.8,888కోట్ల స్కామ్ జరిగిందని, రేవంత్ తన బావమరిది సృజన్‌రెడ్డికి రూ.1,137 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారని కేటీఆర్ అన్నారు.
Similar News
News January 15, 2026
మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్

TG: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు క్లీన్చిట్ ఇచ్చారు. వారు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. కాగా గత నెలలో ఫిరాయింపులకు సరైన ఆధారాల్లేవని <<18592868>>ఐదుగురు<<>> MLAలకు స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ తమ అనర్హతపై ఇంకా స్పీకర్‌కు వివరణ ఇచ్చుకోలేదు.
News January 15, 2026
ఉసిరి నూనెతో ఒత్తైన జుట్టు

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.
News January 15, 2026
NI-MSMEలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్(NI-MSME) 2 కన్సల్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ, BCom,MCom,CA,CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ మెయిల్ recruitment@nimsme.gov.in ద్వారా అభ్యర్థులు జనవరి 30 వరకు అప్లై చేసుకోవాలి. వెబ్సైట్: https://www.nimsme.gov.in/


