News September 26, 2024

KTRకు లీగల్ నోటీసులు

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు సృజన్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. తనపై ‘అమృత్’ టెండర్ల విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక అమృత్ స్కీమ్ టెండర్లలో అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో రూ.8,888కోట్ల స్కామ్ జరిగిందని, రేవంత్ తన బావమరిది సృజన్‌రెడ్డికి రూ.1,137 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారని కేటీఆర్ అన్నారు.

Similar News

News October 5, 2024

హరియాణాలో అన్ని సర్వేలూ కాంగ్రెస్‌కే అనుకూలం

image

హరియాణాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని పీపుల్స్ పల్స్(45-50), CNN(59), రిపబ్లిక్ మ్యాట్రిజ్(55-62), దైనిక్ భాస్కర్(44-54) సంస్థలు అంచనా వేశాయి. సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతు ఉద్య‌మాలు, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌, నిరుద్యోగ స‌మ‌స్య‌లు, అగ్నివీర్ అంశాలు, మహిళా రెజ్లర్ల అందోళన బీజేపీకి ప్ర‌తికూలంగా మారిన‌ట్టు పేర్కొన్నాయి.

News October 5, 2024

EXIT POLLS: హరియాణాలో కాంగ్రెస్‌దే అధికారం: CNN

image

హరియాణాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగలనుందని CNN ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీ 21 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. 59 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ అధికారం దక్కించుకోనుందని పేర్కొంది. పీపుల్స్ పల్స్ సర్వే కూడా కాంగ్రెస్‌దే అధికారం అని తేల్చి చెప్పింది. రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్ కూడా కాంగ్రెస్ 55-62, బీజేపీ 18-24 సీట్లు వస్తాయని పేర్కొంది.

News October 5, 2024

Exit Polls: హరియాణాలో కాంగ్రెస్‌దే గెలుపు

image

హ‌రియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని పీపుల్స్ ప‌ల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచ‌నా వేసింది. 90 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 46-50 సీట్లు సాధించ‌నున్న‌ట్టు స‌ర్వే ఫలితాలు అంచనా వేశాయి. అలాగే అధికార బీజేపీకి ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని, ఆ పార్టీకి కేవ‌లం 20-32 సీట్లు ద‌క్క‌నున్న‌ట్టు సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కు 45 శాతం ఓట్లు దక్కనున్నట్లు పేర్కొంది.