News May 18, 2024
దిగ్గజ బ్యాంకర్ నారాయణ్ వఘుల్ కన్నుమూత
ప్రముఖ బ్యాంకర్, పద్మభూషణ్ గ్రహిత నారాయణ్ వఘుల్ (88) కన్నుమూశారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన కెరీర్ ప్రారంభించిన వఘుల్, 1981లో అతి చిన్న వయసులో (44) బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా బాధ్యతలు అందుకున్నారు. 1985లో ఐసీఐసీఐ బ్యాంక్ ఛైర్మన్, సీఈఓగా పనిచేసిన నారాయణ్ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2009 వరకు సంస్థకు సేవలు అందించారు.
Similar News
News December 6, 2024
BGT: తొలిరోజు ఆసీస్‌దే
భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ తొలిరోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 180 రన్స్‌కు ఆలౌట్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. ఆట ముగిసే సమయానికి 86/1 రన్స్ చేసింది. క్రీజులో మెక్‌స్వీని 38, లబుషేన్ 20 ఉన్నారు. ఆసీస్ వికెట్ల కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు.
News December 6, 2024
మీ వద్ద రూ.2 వేల నోట్లు ఇంకా ఉన్నాయా!
₹2 వేలు విలువైన నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు RBI ప్రకటించి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా 3.46 కోట్ల పెద్ద నోట్లు(₹6,920 Cr) చెలామణిలోనే ఉన్నట్టు కేంద్రం తెలిపింది. 2023లో ఉపసంహరణ ప్రకటన చేసే నాటికి 17,793 లక్షల నోట్లు చెలామణిలో ఉండగా, 2024 Nov నాటికి 17,447 లక్షల నోట్లు వెనక్కి వచ్చాయంది. RBIకి చెందిన 19 కేంద్రాల్లో వీటిని మార్చుకోవచ్చని, పోస్టు ద్వారా పంపవచ్చని తెలిపింది.
News December 6, 2024
గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కుదరదంటూ ప్రభుత్వ వాదనకు అనుకూలంగా తీర్పు చెప్పింది.