News November 9, 2024

దిగ్గజ సారంగి కళాకారుడు రామ్‌నారాయణ్ కన్నుమూత

image

దిగ్గజ వాయిద్యకారుడు పండిట్ రామ్‌ నారాయణ్(96) కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో ఆయన స్వర్గస్థులైనట్లు కుటుంబీకులు తెలిపారు. 1927లో ఉదయ్‌పూర్‌లో జన్మించిన నారాయణ్ హిందుస్థానీ సంగీతంతోపాటు సారంగి వాయిద్యగానంలో నిష్ణాతులు. 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2005లో పద్మవిభూషణ్, 1974-75లో సంగీత నాటక అకాడమీ అవార్డుల్ని అందుకున్నారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Similar News

News December 3, 2024

కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, కరాటే, వాలీబాల్, షూటింగ్ సహా 27 విభాగాల్లో జాతీయ/అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం లేదా విజయం సాధించిన వారు అర్హులు. 18-23 ఏళ్లలోపు వయసున్న టెన్త్ పాసైన వారు DEC 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ.21,709-69,100 జీతం చెల్లిస్తారు. వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News December 3, 2024

రాష్ట్రంలో 7న ఆటోల బంద్

image

TG: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న ఆటోల బంద్‌కు పిలుపునిచ్చారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలకు పరిష్కారం చూపాలని బంద్‌తో పాటు ఇందిరాపార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు AITUC నేతలు తెలిపారు. నిన్న హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో ‘బంద్’ గోడపత్రికలను ఆవిష్కరించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమల్లోకి వచ్చిన నాటి నుంచి పలుమార్లు ఆటో డ్రైవర్లు నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

News December 3, 2024

మార్చి 15 నుంచి ‘టెన్త్’ పరీక్షలు?

image

AP: వచ్చే ఏడాది మార్చి 15 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సంక్రాంతి సెలవుల్లోనూ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదివారాల్లోనూ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ విడుదల చేసిన యాక్షన్ ప్లాన్‌లో రూపొందించారు. సంక్రాంతి సెలవులను 3 రోజులకు కుదించారు.