News August 16, 2024

‘మిస్టర్ బచ్చన్’ నిడివి తగ్గించాం: హరీశ్ శంకర్

image

రవితేజ హీరోగా తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నిడివిని కాస్త తగ్గించినట్లు దర్శకుడు హరీశ్ శంకర్ తెలిపారు. మూవీలో వచ్చే హిందీ సాంగ్స్‌తో పాటు దాదాపు 13 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు పేర్కొన్నారు. పలువురి సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. అప్డేడేట్ ప్రింట్లు ఇవాళ రాత్రి నుంచి రన్ అవుతాయన్నారు. కాగా ఇవాళ రాత్రి ఆయన HYDలోని బాలానగర్ విమల్ థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా చూస్తానన్నారు.

Similar News

News January 21, 2025

WHO నుంచి అమెరికా ఎగ్జిట్: ట్రంప్ ఆర్డర్

image

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి తప్పుకుంటున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ పాస్ చేశారు. ప్రస్తుతం ఆ సంస్థకు US అతిపెద్ద డోనర్. తాజా ఆదేశాలతో ఆ సంస్థకు ఇక ఇబ్బందులు తప్పేలా లేవు. తొలి హయాంలో కరోనా వచ్చినప్పుడూ ట్రంప్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. పారిస్ వాతావరణ మార్పు ఒడంబడిక నుంచీ తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఒప్పందం ఒకవైపే ఉందని, న్యాయంగా లేదని పేర్కొన్నారు.

News January 21, 2025

సోలార్ సెల్ ప్లాంట్‌ను ఏపీలో పెట్టండి: లక్ష్మీ మిట్టల్‌తో మంత్రి లోకేశ్

image

AP: దావోస్‌లోని బెల్వేడార్‌లో మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. భావనపాడును పెట్రోకెమికల్ హబ్‌గా మార్చడానికి పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. పెట్రో కెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. రూ.3,500 కోట్లతో భారత్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న 2GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏపీలో నెలకొల్పాలని కోరారు.

News January 21, 2025

ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

image

తెలంగాణలో ఇంటర్ కాలేజీల్లో <<15028933>>మధ్యాహ్న భోజన పథకం<<>> అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. CM రేవంత్ సూచనలతో ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అంగీకారం తెలిపితే 2025-26 విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించనుంది. రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 425 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, సుమారుగా 1.75 లక్షల మంది చదువుతున్నారు.