News January 21, 2025
WHO నుంచి అమెరికా ఎగ్జిట్: ట్రంప్ ఆర్డర్

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి తప్పుకుంటున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. ప్రస్తుతం ఆ సంస్థకు US అతిపెద్ద డోనర్. తాజా ఆదేశాలతో ఆ సంస్థకు ఇక ఇబ్బందులు తప్పేలా లేవు. తొలి హయాంలో కరోనా వచ్చినప్పుడూ ట్రంప్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. పారిస్ వాతావరణ మార్పు ఒడంబడిక నుంచీ తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఒప్పందం ఒకవైపే ఉందని, న్యాయంగా లేదని పేర్కొన్నారు.
Similar News
News February 20, 2025
భారత్‌లోకి ఐఫోన్ 16ఈ.. ధర ఎంతంటే..

భారత్‌లో తమ మార్కెట్‌ను విస్తరించడంపై యాపిల్ కన్నేసింది. రూ.59వేలకే ఐఫోన్ 16ఈని తీసుకొస్తోంది. ఇది 128 జీబీ ఇంటర్నల్ జీబీతో రానుంది. రేపటి నుంచే అడ్వాన్స్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 నుంచి పూర్తి స్థాయి అమ్మకాలు మొదలవుతాయని యాపిల్ తెలిపింది. ఈ ఫోన్‌లో సింగిల్ కెమెరా మాత్రమే ఉండటం గమనార్హం. ఇక ఐఫోన్ SE అమ్మకాల్ని యాపిల్ భారత్‌లో ఆపేయనున్నట్లు సమాచారం.
News February 20, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోయినా రోహితే కెప్టెన్: కైఫ్

‘ఛాంపియన్స్ ట్రోఫీ’ని భారత్ గెలుచుకోలేకపోయినా సరే 2027 వరల్డ్ కప్ వరకూ రోహిత్ శర్మనే భారత కెప్టెన్‌గా కొనసాగించాలని మాజీ క్రికెటర్ కైఫ్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ సాధించిన ఘనతలు అందరూ సాధించలేరు. టీమ్ ఇండియాను 2023 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చారు. వన్డే ఫార్మాట్లో ఆయన ఆటను, కెప్టెన్సీని ఎవరూ ప్రశ్నించలేరు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌గా రోహిత్ గెలుపు శాతం అద్భుతం’ అని గుర్తుచేశారు.
News February 20, 2025
జెలెన్‌స్కీ ఓ నియంత: ట్రంప్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు గుప్పించారు. ‘ఉక్రెయిన్‌లో ఎన్నికల్ని నిర్వహించకుండా నియంతలా వ్యవహరిస్తున్నారు. స్వదేశంలో ఆయనకు ప్రజాదరణ అంతంతమాత్రంగానే ఉంది. అందుకే ఎన్నికల్ని కూడా జరగనివ్వడం లేదు’ అని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్ట్ పెట్టారు. 2019లో అధ్యక్షుడిగా ఎన్నికైన జెలెన్‌స్కీ పదవీకాలం ముగిసిపోయినా యుద్ధం పేరు చెప్పి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.