News February 20, 2025
కేంద్రం కుట్రలను ఎదుర్కొందాం: భట్టి

TG: విద్యావ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా రాష్ట్రాల్లో నడపలేరని Dy.CM భట్టి అన్నారు. అందరం కలిసి కేంద్రం కుట్రలను ఎదిరించాలని ఆయన పిలుపునిచ్చారు. తిరువనంతపురంలో జరిగిన జాతీయ విద్యా సదస్సులో ఆయన మాట్లాడారు. ‘వీసీల నియామకాల్లో రాష్ట్రాల పాత్రను తొలగించడం, వీసీల అర్హత ప్రమాణాలు మార్చడం భావ్యం కాదు. విద్యావ్యవస్థలో సరైన మార్గాన్ని ఎంచుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News March 15, 2025
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నాం: మంత్రి ఉత్తమ్

TG: ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి (RLIP) కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇది తమ సర్కారు సాధించిన విజయమని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి RLIP నిర్మాణం చేపట్టిందని కేంద్రం వద్ద తాను వాదనలు వినిపించానని చెప్పారు. దీన్ని అడ్డుకోకుండా ఉండి ఉంటే కృష్ణా పరివాహకంలో దుర్భర పరిస్థితి ఏర్పడేదన్నారు.
News March 15, 2025
నటి రన్యా రావు తండ్రిపై ప్రభుత్వం చర్యలు!

బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరులో పట్టుబడిన కన్నడ నటి రన్యా రావు కేసులో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆమె సవతి తండ్రి, హౌసింగ్ కార్పొరేషన్ DGP రామచంద్రారావును సెలవుల్లో పంపింది. ఆయన స్థానంలో కె.వి.శరత్ చంద్రను నియమించింది. మరోవైపు రన్యారావు బెయిల్ పిటిషన్‌ను ఈడీ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ సందర్భంగా తనను కొట్టి తెల్ల కాగితాలపై పోలీసులు సంతకాలు చేయించుకున్నారని రన్యా రావు ఆరోపించారు.
News March 15, 2025
మళ్లీ నేనే సీఎం: రేవంత్ రెడ్డి

TG: రెండోసారి కూడా తానే సీఎం అవుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ‘తొలిసారి BRSపై వ్యతిరేకతతో మాకు ఓటు వేశారు. రెండోసారి మాపై ప్రేమతో వేస్తారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నా పనిని నమ్ముకుని ముందుకు వెళ్తున్నా. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం’ అని తెలిపారు.