News March 22, 2024

అమరావతిని నం.1గా తీర్చిదిద్దుతాం: లోకేశ్

image

AP: రాబోయే ఎన్నికల్లో తమను గెలిపిస్తే అమరావతిని దేశంలోనే నం.1గా తీర్చిదిద్దుతామని నారా లోకేశ్ చెప్పారు. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని లక్ష్యంతో చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తే.. మంగళగిరి MLA ఆర్కే కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. TDP-జనసేన-BJP కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ప్రతి ప్రాంతానికి సురక్షిత నీటిని అందిస్తామని హామీనిచ్చారు.

Similar News

News November 28, 2025

పంచాయతీల విభజనకు గ్రీన్‌సిగ్నల్

image

AP: స్థానిక సంస్థల ఎన్నికలకు SEC సిద్ధమవుతోంది. అందులో భాగంగా గ్రామ పంచాయతీల విభజన, పునర్వ్యవస్థీకరణపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఒక పంచాయతీని విభజించడం/పంచాయతీలోని గ్రామాలను మరో పంచాయతీలో కలపడం/2 పంచాయతీలను విలీనం చేయడానికి వీలవుతుంది. అలాగే పంచాయతీలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలపడానికి మార్గం సుగుమమవుతుంది. లోకల్ ఎలక్షన్స్‌కు ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

News November 28, 2025

ఉపవాసంతో ఆరోగ్య ప్రయోజనాలు..

image

ఉపవాసం అనేది భక్తి మార్గం మాత్రమే కాదు. ఉపవాసం పాటిస్తే మన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. తద్వారా మనసు దేవుడిపై నిలిచి, ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుంది. శరీరానికి ఉపయోగపడే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉపవాసం ఉంటే కొలెస్ట్రాల్, షుగర్ స్థాయి తగ్గి, పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుంది. శరీరం తనకు తానుగా మరమ్మత్తులు చేసుకుని, వయస్సును వెనక్కి నెట్టి, మనం మరింత యంగ్‌గా కనిపించడానికి తోడ్పడుతుంది.

News November 28, 2025

నేటి నుంచి వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుఫాను కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో వర్షాలు పడతాయని వివరించింది. నేడు GNT, బాపట్ల, ప్రకాశం, NLR, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. శని, ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.