News March 27, 2024
అసత్య ప్రచారాలను అడ్డుకుందాం

Way2News లోగోతో కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీరు ఈ ఫేక్ ఉచ్చులో పడకుండా, ఇతరులూ మోసపోకుండా ఆపడం చాలా సులువు. మా ప్రతి ఆర్టికల్‌కు ప్రత్యేక కోడ్ ఉంటుంది. Way2News పేరుతో స్క్రీన్ షాట్ వస్తే అందులోని కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేయండి. మీకు వచ్చిన స్క్రీన్‌షాట్ వార్త కన్పిస్తే ఆ పోస్టు మేము పబ్లిష్ చేశామని అర్థం. ఆ వార్త రాలేదంటే మీకు ఫేక్ స్క్రీన్‌షాట్ వచ్చిందని గ్రహించాలి.
Similar News
News March 5, 2026
సెమీస్.. భారత్ భారీ స్కోర్

T20WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా 253/7 స్కోర్ చేసింది. అభిషేక్(9), సూర్య(11) విఫలమవగా, సంజూ శాంసన్ 89, ఇషాన్ 39, శివమ్ దూబే 43, తిలక్ 21, హార్దిక్ 27 రన్స్‌తో రాణించారు. విల్ జాక్స్, రషీద్ చెరో 2, ఆర్చర్ ఒక వికెట్ తీశారు. విజయం కోసం ఇంగ్లండ్ 254 పరుగులు చేయాలి. ఇవాళ గెలిచిన జట్టు ఈ నెల 8న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడుతుంది.
News March 5, 2026
బాలీవుడ్ మూవీలా పశ్చిమాసియా పాలిటిక్స్!

పశ్చిమాసియా జియో పాలిటిక్స్ బాలీవుడ్ మూవీలా కనిపిస్తున్నాయంటూ <<18418395>>హర్ష్ గోయెంకా<<>> ట్వీట్ చేశారు. ‘‘ఇజ్రాయెల్ వెంట IND ఉంది. USతో ఇజ్రాయెల్, పాక్‌తో US, ఇరాన్ వెంట PAK ఉంది. అయితే IND-PAK శత్రువులుగానే ఉన్నాయి. ఇది ‘ముఖద్దర్ కా సికందర్’ మూవీని గుర్తు చేస్తోంది. రేఖను అంజాద్ ప్రేమిస్తారు. అమితాబ్‌ను రేఖ, రాఖీని అమితాబ్, వినోద్‌ను రాఖీ లవ్ చేస్తారు. అయితే అంజాద్, అమితాబ్ శత్రువులే’’ అని పేర్కొన్నారు.
News March 5, 2026
బెంగాల్ గవర్నర్ రాజీనామా.. మమత ఏమన్నారంటే?

బెంగాల్ గవర్నర్ పదవికి ఆనంద్ బోస్ రాజీనామా చేయడం షాక్‌కు గురి చేసిందని సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ‘ఆయన రిజైన్ వెనుక కారణం తెలియదు. కానీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడి చేసి ఉంటారు. ఎన్.రవిని WB గవర్నర్‌గా నియమిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ విషయంలో నాతో చర్చించలేదు. ఇలాంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తాయి’ అని ట్వీట్ చేశారు.


