News March 29, 2024
‘ఫేక్’ వైరస్‌ను కట్టడి చేద్దాం
కరోనా కంటే వేగంగా వ్యాపించే ఫేక్ న్యూస్‌ను వెంటనే అడ్డుకుందాం. Way2News లోగోతో కొందరు ఫేక్ వార్తలు వైరల్ చేస్తున్నారు. మా వార్తల వెరిఫికేషన్ చాలా సులువు. మా ప్రతి ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్‌ను యాప్‌లో/ fc.way2news.comలో ఎంటర్ చేస్తే మీకు వచ్చిన ఆర్టికల్ కన్పించాలి. లేదంటే ఫార్వర్డ్ అయ్యే వార్త ఫేక్. Way2News పేరుతో వైరల్ అయ్యే ఫేక్ వార్తలను grievance@way2news.comకు పంపండి.
Similar News
News January 19, 2025
అది సైఫ్ నివాసమని దొంగకు తెలియదు: అజిత్
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి నేపథ్యంలో ముంబైలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఖండించారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. నిందితుడికి అది సెలబ్రిటీ నివాసమని తెలియదని, దొంగతనం కోసమే వెళ్లాడని తెలిపారు. అతడు బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వచ్చి తర్వాత ముంబైకి మకాం మార్చాడన్నారు. కాగా నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
News January 19, 2025
ఖోఖో.. మనోళ్లు కొట్టేశారంతే!!
ఖోఖో తొలి ప్రపంచకప్‌లోనే భారత్ తన సత్తా చాటింది. మన పురుషులు, మహిళల జట్లు విశ్వ విజేతలుగా నిలిచాయి. కాసేపటి క్రితం ముగిసిన మెన్స్ ఫైనల్స్‌లో నేపాల్‌పై 54-36 తేడాతో టీమిండియా గెలుపొంది తొలి కప్‌ను ముద్దాడింది. అంతకుముందు అమ్మాయిల జట్టు సైతం నేపాల్ ఉమెన్స్ టీమ్‌ను 78-40 తేడాతో చిత్తు చేసి తొలి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. భారత్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 23 దేశాలు పాల్గొన్నాయి.
News January 19, 2025
డబ్బులిస్తేనే కూల్చివేతలు ఆగుతాయని అధికారుల బెదిరింపులు: ఈటల
TG: హైడ్రా పేరుతో 3 నెలలుగా INC ప్రభుత్వం హంగామా చేస్తోందని BJP MP ఈటల రాజేందర్ విమర్శించారు. బాలాజీ నగర్, జవహర్ నగర్‌లో పేదలు భూములు కొని 40 ఏళ్లుగా అక్కడ ఉంటున్నారని తెలిపారు. డబ్బులిస్తేనే కూల్చివేతలు ఆగుతాయని అధికారులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఇంత అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని దుయ్యబట్టారు. ప్రతి పనిలో 7-10 శాతం కమీషన్ ఇవ్వనిదే బిల్లులు సెటిల్ కావట్లేదన్నారు.