News August 14, 2024
సీఎం చంద్రబాబుకు ఆర్మీ మాజీ ఉద్యోగుల లేఖ
AP: మిలిటరీ, పారామిలిటరీలో పనిచేసిన సైనికులకు రాష్ట్రంలో SPO(స్పెషల్ పోలీస్ ఆఫీసర్)గా ఉద్యోగం కల్పించాలని CM చంద్రబాబుకు ఎస్పీవో యూనియన్ లేఖ రాసింది. కరోనా సమయంలోనూ సేవలు అందించామని, 11 నెలలుగా తమకు జీతాలు ఇవ్వలేదని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సాలరీ అడిగినందుకు ఉద్యోగం నుంచి తొలగించారన్నారు. అనుభవాన్ని బట్టి మాజీ ఉద్యోగులకు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News September 10, 2024
APPLY NOW: దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు
స్పోర్ట్స్ కోటాలో 67 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్) ప్రకటించింది. SEP 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని, అక్టోబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. మహిళలు, పురుషులకు అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, చెస్, వెయిట్ లిఫ్టింగ్, క్రికెట్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ తదితర కేటగిరీల్లో <
News September 10, 2024
హైడ్రాకు ప్రత్యేక సిబ్బంది కేటాయింపు
TG: చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సిబ్బందిని కేటాయించింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్సై స్థాయి అధికారులను కేటాయిస్తూ డీజీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రాకు కమిషనర్‌గా రంగనాథ్ ఉన్న సంగతి తెలిసిందే.
News September 10, 2024
ఉచిత బస్సుతో అద్భుత ఫలితాలు.. సీఎంతో అధికారులు
TG: ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉచిత బస్సు స్కీం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని అధికారులు సమీక్షలో సీఎంకు చెప్పారు. ఇప్పటివరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, తద్వారా ప్రయాణికులకు రూ.2,840 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. వివిధ జిల్లాల నుంచి HYDలోని ఆస్పత్రులకు వస్తున్న మహిళల సంఖ్య పెరిగిందని వివరించారు.