News April 29, 2024
లైట్ బీర్లు అందుబాటులో ఉంచాలని లేఖ
వైన్స్‌లో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదని మంచిర్యాల జిల్లా యువకుడు ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘నేను తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని. 18 రోజుల్లో రాష్ట్రానికి ₹670 కోట్ల ఆదాయం తెచ్చాం. కానీ లైట్ బీర్లు లేకపోవడంతో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు యువకులు, పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. మా కోరిక మేరకు వాటిని అందుబాటులో ఉంచండి. సర్కారు ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తాం’ అని తెలిపారు.
Similar News
News November 13, 2024
ICC ర్యాంకింగ్స్.. నం.1 ప్లేస్‌లో పాక్ బౌలర్
ICC తాజాగా ప్రకటించిన వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాక్ బౌలర్ షాహీన్‌షా అఫ్రీది నంబర్ 1 ర్యాంక్ సాధించారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు అద్భుతమైన ప్రదర్శన చేశారు. మూడు వన్డేల్లో 8 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌కు ముందు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 4వ ప్లేస్‌లో ఉన్న అఫ్రీది ఏకంగా తొలి స్థానానికి దూసుకొచ్చారు. IND తరఫున కుల్దీప్(4), బుమ్రా(6), సిరాజ్(8) టాప్-10లో ఉన్నారు.
News November 13, 2024
చంద్రబాబుకు అప్పు రత్న బిరుదు ఇవ్వాలి: జగన్
AP: చంద్రబాబు హయాంలో అప్పులు 19శాతం పెరిగితే, తాను సీఎంగా ఉన్న కాలంలో 15శాతం మాత్రమే పెరిగినట్లు YS జగన్ వెల్లడించారు. రూ.10 లక్షల కోట్లు, రూ.14లక్షల కోట్ల అప్పు అని తమపై తప్పుడు ప్రచారం చేసి, బడ్జెట్‌లో రూ.6లక్షల కోట్ల అప్పు మాత్రమే చూపించారని ఆరోపించారు. అంటే చంద్రబాబు, కూటమి నేతలు చేసిందంతా తప్పుడు ప్రచారం కాదా? అని ప్రశ్నించారు. అప్పు రత్న అనే బిరుదును చంద్రబాబుకు ఇవ్వాలని సెటైర్లు వేశారు.
News November 13, 2024
ALERT: రేపు భారీ వర్షాలు
AP: అల్పపీడనం బలహీనపడినప్పటికీ రేపు కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఈనెల 15, 16 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. రేపు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, ATP, సత్యసాయి, TPTY జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అల్లూరి, కోనసీమ, ప.గో, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, YSR, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.