News February 1, 2025
తులం బంగారం ఏదని నిలదీయాలి: KTR

TG: రాష్ట్రంలో 100% రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తా అని సవాల్ చేశానని, దానిపై సీఎం రేవంత్ స్పందించలేదని KTR అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన రైతుబంధు పైసలు కూడా బీఆర్ఎస్ కూడబెట్టినవే అని చెప్పారు. ‘రేవంత్ సర్కార్ ఒక్క రూపాయి కూడా రైతుబంధు ఇవ్వలేదు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టే రైతుబంధు డ్రామా. ఎకరాకు రూ.17,500 ఇచ్చేదాకా వదిలిపెట్టొద్దు. తులం బంగారం ఏదని మహిళలు నిలదీయాలి’ అని KTR అన్నారు.
Similar News
News February 16, 2025
నిద్రలేవగానే ఇలా చేయండి

రోజుని ఉల్లాసంగా ప్రారంభించేందుకు ఉదయాన్నే నిద్ర లేవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్లతో ఫిట్‌గా ఉండటమే కాకుండా ఒత్తిడిని జయిస్తారని నిపుణులు చెబుతున్నారు.
* వేకువజామునే నిద్రలేవడం
* యోగా/వ్యాయామం/ధ్యానం చేయడం
* లేచిన వెంటనే నీరు తాగడం(కుదిరితే గోరువెచ్చని నీరు)
* ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్
* సానుకూలమైన ఆలోచనలు
* రోజులో ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి.
News February 16, 2025
కోళ్లు చనిపోతే ఈ నంబర్‌కు కాల్ చేయండి!

TG: ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న వేళ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మం. నేలపట్లలో వెయ్యి బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు కోళ్ల నమూనాలు సేకరించి HYDలోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ల్యాబుకు పంపారు. 3 రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్ రానుందని, అప్పటివరకు కోళ్లు అమ్మవద్దని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడైనా కోళ్లు చనిపోతే 9100797300కు కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
News February 16, 2025
కెనడా వీసా నిబంధనలు మరింత కఠినతరం

వీసా నిబంధనల్ని కెనడా మరింత కఠినతరం చేసింది. ఇమ్మిగ్రేషన్ అధికారులకు మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. జారీ చేసిన స్టడీ వీసాలు, వర్క్ పర్మిట్, తాత్కాలిక నివాస అనుమతులను కూడా ఇకపై వారు రద్దు చేయొచ్చు. గతంలో దరఖాస్తుల తిరస్కరణ అధికారం మాత్రమే వారికి ఉండేది. కాగా.. అంతర్జాతీయ విద్యార్థులు తమ దేశంలో చేయాల్సిన బ్యాంకు డిపాజిట్‌ను ఇప్పటికే కెనడా రెండింతలు చేసింది.