News May 24, 2024
ప్రెగ్నెంట్ భార్య పొట్ట కోసిన భర్తకు జీవితఖైదు

పుట్టబోయే బిడ్డ జెండర్ తెలుసుకునేందుకు భార్య(8నెలల ప్రెగ్నెంట్) పొట్ట కోసిన భర్తకు UP కోర్టు జీవితఖైదు విధించింది. బదౌన్‌కు చెందిన పన్నాలాల్, అనిత దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు. ఆమె మళ్లీ గర్భవతి కావడంతో ఈసారి మగబిడ్డను కని ఇవ్వాలని అనితతో అతడు గొడవ పడ్డాడు. లోపల ఎవరున్నారో చూస్తానంటూ ఆమె పొట్ట కోశాడు. దీంతో స్థానికులు ఆసుపత్రికి తరలించగా ఆమె ప్రాణాలతో బయటపడింది. కానీ లోపలున్న మగబిడ్డ చనిపోయింది.
Similar News
News November 14, 2025
KVS, NVSలో 14,967 పోస్టుల వివరాలు

<
News November 14, 2025
స్పోర్ట్స్ రౌండప్

⋆ నోయిడాలో నేటి నుంచి వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టోర్నీ. 51 కేజీల విభాగంలో పోటీ పడనున్న నిఖత్ జరీన్.. బరిలోకి మరో 19 మంది భారత బాక్సర్లు
⋆ చెస్ WC నుంచి ప్రజ్ఞానంద ఔట్.. ప్రీ క్వార్టర్స్‌కు అర్జున్, హరికృష్ణ
⋆ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్: వ్యక్తిగత, టీమ్ కాంపౌండ్ ఈవెంట్స్‌లో ‘గోల్డ్’ సాధించిన జ్యోతి సురేఖ
⋆ నేటి నుంచి ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ క్రికెట్ టోర్నీ.. UAEతో IND-A ఢీ
News November 14, 2025
జూబ్లీహిల్స్ కౌంటింగ్: అభ్యర్థి మృతి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం నెలకొంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్(40) నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. ఎర్రగడ్డలో నివాసం ఉండే ఈయన అక్టోబర్ 22న నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్‌ను యాక్సెప్ట్ చేయగా పోటీలో నిలిచారు. ఫలితాలకు ఒకరోజు ముందు మహమ్మద్ అన్వర్ మరణించడంతో ఆయన అనుచరులు విషాదంలో మునిగిపోయారు.


