News May 24, 2024

ప్రెగ్నెంట్ భార్య పొట్ట కోసిన భర్తకు జీవితఖైదు

image

పుట్టబోయే బిడ్డ జెండర్ తెలుసుకునేందుకు భార్య(8నెలల ప్రెగ్నెంట్) పొట్ట కోసిన భర్తకు UP కోర్టు జీవితఖైదు విధించింది. బదౌన్‌కు చెందిన పన్నాలాల్‌, అనిత దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు. ఆమె మళ్లీ గర్భవతి కావడంతో ఈసారి మగబిడ్డను కని ఇవ్వాలని అనితతో అతడు గొడవ పడ్డాడు. లోపల ఎవరున్నారో చూస్తానంటూ ఆమె పొట్ట కోశాడు. దీంతో స్థానికులు ఆసుపత్రికి తరలించగా ఆమె ప్రాణాలతో బయటపడింది. కానీ లోపలున్న మగబిడ్డ చనిపోయింది.

Similar News

News March 5, 2026

తెలంగాణ టెన్త్ హాల్ టికెట్లు వచ్చేశాయ్..

image

TG: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. <>bse.telangana.gov.in<<>>/ సైట్‌లో జిల్లా, స్కూల్, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే 8096958096 వాట్సాప్ నంబర్‌కు Hi అని మెసేజ్ చేసి కూడా హాల్ టికెట్ పొందవచ్చు. రాష్ట్రంలో మార్చి 14 నుంచి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి.
Share It

News March 5, 2026

మిడిల్ ఈస్ట్‌లో వార్.. మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధానికి దౌత్య పరిష్కారం అవసరమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అభిప్రాయపడ్డారు. అమెరికా-ఇజ్రాయెల్vs ఇరాన్ వార్ ముగించేందుకు మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించారు. శాంతి కోసం దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే UAE ప్రెసిడెంట్ నహ్యాన్‌తో సహా గల్ఫ్ దేశాల నాయకులతో చర్చించినట్లు పేర్కొన్నారు. యుద్ధం విస్తరిస్తే ఎవరూ లాభపడరని, ప్రజలే నష్టపోతారని చెప్పారు.

News March 5, 2026

‘నేను ఇంటికి వెళ్లాలి’.. వెస్టిండీస్ కోచ్ ఆవేదన!

image

T20 WC నుంచి వెస్టిండీస్ నిష్క్రమించినప్పటికీ ఆ జట్టు ఆటగాళ్లు ఇంకా ఇండియాలోనే ఉండిపోయారు. ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గగనతల ఆంక్షలతో వారు వెళ్లేందుకు వీలు కాలేదు. ఈ క్రమంలో తనకు ఇంటికి వెళ్లాలని ఉందంటూ వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సమీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కనీసం అప్డేట్ ఇవ్వండి. ఎప్పుడు వెళ్తామో చెప్పండి. ఈ రోజా? రేపా? వచ్చే వారమా? ఇప్పటికే 5 రోజులు అవుతోంది’ అని ట్వీట్ చేశారు.