News March 10, 2025
ప్రణయ్ హత్య కేసు: ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు

TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ఏ2గా ఉన్న సుభాష్‌కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీ రావు 2020లో ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో మిర్యాలగూడలో అమృతతో కలిసి వెళ్తోన్న ప్రణయ్‌ను సుభాష్ శర్మ కత్తితో నరికి చంపాడు.
Similar News
News March 10, 2025
నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు

AP: MLA కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురు టీడీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి అభ్యర్థులు కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు నామినేషన్ పత్రాలను అందించారు. అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేశ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు.
News March 10, 2025
దేశవ్యాప్తంగా శ్రీచైతన్య విద్యాసంస్థలపై ఐటీ రైడ్స్

దేశంలోని 6 రాష్ట్రాల్లో 7 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని శ్రీచైతన్య విద్యాసంస్థల్లో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను అవకతవకలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
News March 10, 2025
ఈనెల 20లోపు అన్ని పోటీ పరీక్షల రిజల్ట్స్: TGPSC

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం నిరీక్షించకుండా టీజీపీఎస్సీ చర్యలు చేపట్టింది. ఈనెల 20లోపు అన్ని పోటీ పరీక్షల రిజల్ట్స్ వెల్లడిస్తామని ప్రకటించింది. తాజాగా గ్రూప్-1 ఫలితాలు వెల్లడించింది. రేపు గ్రూప్-2, ఈనెల 14న గ్రూప్-3, ఈనెల 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఈనెల 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది.