News March 18, 2024

జీవితం కష్టమైనది: మాజీ క్రికెటర్

image

మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఆసుపత్రిలో చేరారు. బెడ్‌పై చికిత్స పొందుతున్న ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. ‘జీవితం కష్టమైనది’ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చారు. ‘మీరు త్వరగా కోలుకోవాలి సార్. మీ కామెంట్రీ వినడానికి ఎదురుచూస్తున్నా’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా ‘అది జరుగుతుందని నేను అనుకోవట్లేదు’ అంటూ శివరామకృష్ణన్ రిప్లై ఇచ్చారు. ఆయన ఆసుపత్రిలో చేరడానికి గల కారణాలు తెలియరాలేదు.

Similar News

News September 30, 2024

ఏపీ ప్రభుత్వ తీరును ఆక్షేపించిన సుప్రీంకోర్టు

image

ల‌డ్డూ వివాదంలో AP ప్ర‌భుత్వం తీరును SC ఆక్షేపించింది. ‘ఈ వివాదంపై Sep 18న ముఖ్యమంత్రి ప్ర‌క‌ట‌న చేశారు. Sep 25న FIR న‌మోదైంది. Sep 26న సిట్ ఏర్పాటైంది. విచార‌ణ పూర్త‌వ్వ‌క‌ముందే మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా మీడియా ముందు ప్ర‌క‌ట‌న చేయాల్సిన అవసరం ఏముంది’ అని ప్రశ్నించింది. ల‌డ్డూలు రుచిగా లేవ‌ని భ‌క్తులు ఫిర్యాదు చేశారని TTD లాయర్ పేర్కొన్నారు. మరి ఆ లడ్డూలను పరీక్షలకు పంపారా? అంటూ కోర్టు నిలదీసింది.

News September 30, 2024

లడ్డూ వివాదం.. SC వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందన

image

తిరుమల లడ్డూ వ్యవహారంపై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి స్పందించారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇవాళ ‘దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి’ అన్న వ్యాఖ్యలను ఆయన కోట్ చేశారు. SC స్టేట్‌మెంట్‌ను పోస్ట్ చేశారు. కాగా లడ్డూ వివాదాన్ని పెద్దది చేయకుండా దర్యాప్తు చేయాలని ఇటీవల ప్రకాశ్ రాజ్ అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.

News September 30, 2024

సీఎం సోదరుడి ఇల్లు ఎందుకు కూల్చడంలేదు: KTR

image

TG: ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న CM రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటిని ఎందుకు కూల్చడం లేదని మాజీ మంత్రి KTR ప్రశ్నించారు. ‘40-50 ఏళ్ల కిందట కట్టుకున్న పేదల ఇళ్లను పడగొడతామంటే నీ అయ్య జాగీర్ కాదని గుర్తుచేస్తున్నా. HYDలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం పడగొట్టారు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు భయపడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.1150 కోట్ల నుంచి రూ.750 కోట్లకు పడిపోయింది’ అని KTR తెలిపారు.