News March 18, 2024
జీవితం కష్టమైనది: మాజీ క్రికెటర్

మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఆసుపత్రిలో చేరారు. బెడ్‌పై చికిత్స పొందుతున్న ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. ‘జీవితం కష్టమైనది’ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చారు. ‘మీరు త్వరగా కోలుకోవాలి సార్. మీ కామెంట్రీ వినడానికి ఎదురుచూస్తున్నా’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా ‘అది జరుగుతుందని నేను అనుకోవట్లేదు’ అంటూ శివరామకృష్ణన్ రిప్లై ఇచ్చారు. ఆయన ఆసుపత్రిలో చేరడానికి గల కారణాలు తెలియరాలేదు.
Similar News
News December 8, 2025
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ షెడ్యూల్

*ఇవాళ 1.30PMకు గవర్నర్ ఈ సదస్సును ప్రారంభిస్తారు
*ప్రజాపాలన, రెండేళ్లలో సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి గెస్టులకు వివరిస్తారు
*3PM-7PM వరకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి, కొరియా బృందం, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐకియా, వరల్డ్ బ్యాంక్, SIDBI సహా వివిధ రకాల పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారు.
News December 8, 2025
హీరోయిన్‌కు వేధింపులు.. మలయాళ నటుడిని నిర్దోషిగా తేల్చిన కోర్టు

హీరోయిన్‌పై లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు కేరళలోని ఎర్నాకులం జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. వారికి శిక్షను ఈనెల 12న ప్రకటించనుంది. 2017లో సినీ నటిపై వేధింపుల కేసులో దిలీప్ అరెస్టయ్యారు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. దాదాపు 8 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది.
News December 8, 2025
ఇండిగో సంక్షోభం.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో

ఇండిగో విమానాల సంక్షోభంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే ఇది తీవ్రమైన సమస్య అని, లక్షలాది మంది బాధితులు ఉన్నారని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా విమానాల రద్దుపై ఈ పిల్ దాఖలైంది.


