News August 8, 2024

పీరియడ్స్‌లోనూ 199kgలు ఎత్తి నాల్గోస్థానంలో!

image

మహిళలు పీరియడ్స్ సమయంలో వీక్ అయిపోయి ఏ పనీ చేయలేకపోతుంటారు. అలాంటిది భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఓ సెట్‌లో ఏకంగా 111 కిలోల బరువును ఎత్తారు. పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం 199kgs ఎత్తి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయారు. గాయంతో పాటు పీరియడ్స్ రావడంతో బలహీనంగా మారానని, ఇది తన ఆటపై ప్రభావం చూపినా మెరుగైన ప్రదర్శన ఇచ్చినట్లు ఆమె తెలిపారు. చాను గత ఒలింపిక్స్‌లో రజతం సాధించారు.

Similar News

News September 15, 2024

వరదలపై అసత్య ప్రచారం వైసీపీ కుట్ర: మంత్రి నారాయణ

image

AP: విజయవాడలో మళ్లీ వరదలు వస్తున్నాయని జరిగిన ప్రచారం వెనుక వైసీపీ కుట్ర ఉందని మంత్రి నారాయణ ఆరోపించారు. వరదలపై అసత్య పోస్టుల గురించి డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలో పరిస్థితి మెరుగైందని అన్నారు. అగ్నిమాపక శకటాలతో ఇళ్లు శుభ్రం చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

News September 15, 2024

ముగ్గురు ఐపీఎస్‌లకు ప్రభుత్వం షాక్

image

AP: ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, మరో ఐపీఎస్ విశాల్ గున్నిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పేరుతో ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధించారని వీరిపై ఆరోపణలున్నాయి.

News September 15, 2024

ఇవాళే ఎందుకు రాజీనామా చేయకూడదు?: బీజేపీ

image

ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ 48 గంటల్లో కాకుండా ఇవాళే ఎందుకు రాజీనామా చేయకూడదని బీజేపీ ప్రశ్నించింది. ఆప్ చీఫ్ ఎందుకీ డ్రామా క్రియేట్ చేస్తున్నారని దుయ్యబట్టింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనే ఆ పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొంది. రోడ్లపై కేజ్రీవాల్ ప్రచారం చేసినా ప్రజలు ఆయనను సరైన స్థానంలో ఉంచారని విమర్శించింది. మరోవైపు సీఎం రాజీనామా నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది.