News August 19, 2024
హనుమకొండ బెటాలియన్ ఎత్తివేత
TG: హనుమకొండలోని 58వ బెటాలియన్‌ను శాశ్వతంగా ఎత్తివేస్తూ సీఆర్పీఎఫ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మావోయిస్టుల ప్రాబల్యంతో 1990లో పలివేల్పుల రోడ్డులో దీనిని కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మావోల ప్రాబల్యం తగ్గడంతో మణిపుర్‌లో నెలకొల్పాలని నిర్ణయించారు. దీనితో పాటు కాటారం, మహముత్తారం పరిధిలోని జీ 58, బీ 58 బెటాలియన్లలోని 238 మంది జవాన్లను తరలించనున్నట్లు సమాచారం.
Similar News
News September 10, 2024
భారత స్టేడియంపై అఫ్గానిస్థాన్ టీమ్ ఆగ్రహం
అఫ్గానిస్థాన్ జట్టు తమ హోమ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడుతుంటుంది. గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ స్టేడియంలో ఆ జట్టు న్యూజిల్యాండ్‌తో సోమవారం నుంచి టెస్టు ఆడాల్సి ఉంది. వర్షం లేకపోయినా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గ్రౌండ్ చిత్తడిగా ఉండి తొలి రెండ్రోజుల మ్యాచ్ రద్దైంది. దీంతో అఫ్గాన్ జట్టు సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్టేడియంలో ఇంకెప్పుడూ మ్యాచులు ఆడేది లేదని మండిపడ్డారు.
News September 10, 2024
ట్రంప్ ఓడితే.. అమెరికన్లకు మస్క్ హెచ్చరిక
రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతే అమెరికాకు ఇవే ఆఖరి అసలు సిసలైన ఎన్నికలు అవుతాయని బిలియనీర్ ఎలాన్ మస్క్ హెచ్చరించారు. కోటిన్నర మంది అక్రమ వలసదారుల్ని సక్రమం చేసేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరింత మందిని తీసుకొచ్చి వారు స్వింగ్ స్టేట్స్ గెలిచి అమెరికాను ఏకపార్టీ రాజ్యంగా మార్చేస్తారని తెలిపారు. 1986 ఆమ్నెస్టీ సంస్కరణలతో కాలిఫోర్నియా ఇలాగే మారిందని గుర్తుచేశారు.
News September 10, 2024
రూ.5వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లు: భట్టి విక్రమార్క
TG: రాష్ట్రంలో ఏటా రూ.20వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఆర్థిక సంఘం సమావేశంలో ఆయన రాష్ట్ర పథకాలపై వివరించారు. అక్షరాస్యత పెంపునకు రూ.5వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిని నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకొస్తామన్నారు. టాటా కంపెనీ సహకారంతో 65 ఐటీఐలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.