News March 17, 2024
గ్రేటర్ పరిధిలో తేలికపాటి జల్లులు
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుండటం వల్ల రాగల 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 34.4, కనిష్ఠం 23.0 డిగ్రీలు, గాలిలో తేమ 50 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Similar News
News October 14, 2024
దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టుకు రేపే శంకుస్థాపన
ఈనెల 15న వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం నేవీ రాడార్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రానున్నారు. ఈ నేపథ్యంలో నేవీ రాడార్ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమ పనులను నేవీ అధికారులతో కలిసి డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టీ.రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. రేపు HYD నుంచి వారు దామగుండం వెళ్లనున్నారు.
News October 14, 2024
HYD: హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
మాజీ మంత్రి హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. శాసనమండలి చీఫ్ విప్ నియామకం రాజ్యాంగ బద్ధంగానే జరిగిందన్నారు. సంప్రదాయం ప్రకారమే ప్రతిపక్ష సభ్యుడికి పీఏసీ ఛైర్మన్ హోదా ఇచ్చామని, ఎమ్మెల్యేల అనర్హత అంశం కోర్టులో ఉందన్నారు. ఎక్కడా ఉల్లంఘనలు లేవని, అయినా హరీశ్‌రావుకు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం అలవాటుగా మారిందని మంత్రి వ్యాఖ్యానించారు.
News October 14, 2024
HYD: మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం: హరీశ్‌రావు
చీఫ్ విప్‌గా పట్నం మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ‘కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంది. బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చీఫ్ విప్ బాధ్యత. మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇష్యూ చేస్తాడు?.. అధికార పార్టీ సభ్యులకా.. ప్రతి పక్ష పార్టీ సభ్యులకా’ అని ప్రశ్నించారు.