News August 30, 2024

పాన్ మసాలాలు కావవి.. నికోటిన్ బాంబులు

image

దేశంలో రోడ్డు ప్రమాదాలు, తుపాకీ గుళ్లతో పోలిస్తే గుట్కా, పాన్ మసాలాలతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారని టాటా ACTREC శాస్త్రవేత్తలు అన్నారు. పొగరాని పొగాకు ఉత్పత్తులైన (SLT) ఖైనీ, గుట్కా, పాన్ మసాలా, మిష్రీ గుల్, క్రీమీ స్నఫ్, డ్రై స్నఫ్ ప్రమాదకరమని చెప్పారు. ఇవి వ్యసనపరులుగా మారుస్తాయన్నారు. చాలా SLTల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని, 2 కెమికల్స్ శరీరంలో సులభంగా చేరిపోయి కిక్కిస్తాయని పేర్కొన్నారు.

Similar News

News September 10, 2024

హనీ ట్రాప్ జరిగింది.. నాపై కేసు కొట్టేయండి: ఎమ్మెల్యే పిటిషన్

image

AP: తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసు <<14034033>>కొట్టేయాలని<<>> సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జులై, ఆగస్టులో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా మహిళ ఎందుకు ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. దీన్ని హనీట్రాప్‌గా పేర్కొన్నారు. తనను బెదిరించి అత్యాచారం చేశారని టీడీపీకి చెందిన ఓ మహిళ <<14026695>>వీడియోలు<<>> రిలీజ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News September 10, 2024

ఆ ఉద్యోగాల భర్తీపై ప్రచారం ఫేక్.. నమ్మొద్దు: సమగ్రశిక్ష

image

AP: డిగ్రీ అర్హతతో పలు ప్రభుత్వ ఉద్యోగాలను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సమగ్ర శిక్ష అధికారులు ఖండించారు. ‘సెంట్రల్, స్టేట్ స్కూల్స్, గురుకులాలు, ఇంటర్ బోర్డులో ఉద్యోగాలు అంటూ వార్తలు వస్తున్నాయి. DIKSHA&UNICEF కౌన్సెలింగ్ సెంటర్‌లోనూ పోస్టుల భర్తీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వార్తలను నమ్మొద్దు. దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు’ అని తెలిపారు.

News September 10, 2024

DANGER: దగ్గుకు ఈ మందు వాడొద్దు!

image

TG: లైసెన్స్ లేకుండా దగ్గు మందు (కాఫ్ సిరప్) తయారు చేస్తున్న కంపెనీపై అధికారులు రైడ్స్ చేశారు. HYD కూకట్‌పల్లిలో అఖిల్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ ‘Glycoril Cough Syrup’ అనే సిరప్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. క్వాలిటీ స్టాండర్డ్స్ లేని ఈ సిరప్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, వినియోగించవద్దని హెచ్చరించారు. ఇలాంటి మందులు ఉంటే 1800-599-6969కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.
SHARE IT