News November 13, 2024

అశ్విన్ కంటే లయన్ మెరుగైన ఆటగాడు: మాజీ స్పిన్నర్

image

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కంటే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయనే మెరుగైన బౌలర్ అని సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్ పేర్కొన్నారు. ‘లయన్ ఒక కంప్లీట్ బౌలర్. ఉపఖండపు పిచ్‌లైనా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పిచ్‌లైనా ప్రభావం చూపించగలరు. అశ్విన్ కంటే లయనే బ్యాటర్లను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటారు’ అని వివరించారు. లయన్ 129 మ్యాచుల్లో 530 వికెట్లు తీయగా అశ్విన్ 105 టెస్టుల్లో 536 వికెట్స్ తీశారు.

Similar News

News December 14, 2024

ఉద్దేశం మంచిదైతే ‘జమిలి’ మేలే: ప్రశాంత్ కిషోర్

image

స‌దుద్దేశంతో జ‌మిలి ఎన్నిక‌లు నిర్వహిస్తే దేశానికి మంచిదే అని ప్ర‌శాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ఉగ్ర చ‌ర్య‌ల క‌ట్ట‌డికి తెచ్చే చ‌ట్టాన్ని ఒక వ‌ర్గానికే వ్య‌తిరేకంగా ఉప‌యోగించే అవకాశం ఉన్నప్పుడు, ఇది కూడా అలా కాకూడదన్నారు. 1960 వ‌ర‌కు జ‌రిగిన జ‌మిలి ఎన్నిక‌ల్ని దుర్వినియోగం చేసే ఉద్దేశాలు లేకుండా ప్ర‌వేశ‌పెడితే మంచిదే అని పేర్కొన్నారు. దీన్ని క్రమపద్ధతిలో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News December 14, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 14, 2024

డిసెంబర్ 14: చరిత్రలో ఈ రోజు

image

1799: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ మరణం
1924: బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ జననం
1978: నటి సమీరా రెడ్డి జననం
1982: దక్షిణాది నటుడు ఆది పినిశెట్టి జననం
1984: నటుడు రానా(ఫొటోలో) జననం
* జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
* అంతర్జాతీయ కోతుల దినోత్సవం