News December 29, 2024
నెలాఖరులో రూ.1000 కోట్ల మద్యం అమ్మకాలు?
TG: కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే స్టాక్ మద్యం డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. గత మూడు రోజుల్లో రూ.565 కోట్ల విలువైన మద్యం లిఫ్ట్ చేసినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. ఇవాళ మద్యం డిపోలకు సెలవుదినం అయినప్పటికీ స్టాక్ పంపిణీకి ఓపెన్ ఉంచనున్నారు. ఈ ఏడాది నెలాఖరుకు రూ.1000 కోట్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Similar News
News January 14, 2025
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ సీజేగా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇటీవల సీజేల బదిలీలకు సుప్రీం కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
News January 14, 2025
అధికారుల తీరుపై మంత్రి పొన్నం నిరసన
TG: హన్మకొండ జిల్లా కొత్తకొండ జాతరకు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన రాగానే అక్కడి ఏర్పాట్లపై భక్తులు ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. అధికారుల తీరుపై కోపంతో మంత్రి వసతి గృహం వద్ద నేలపై కూర్చున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు గర్భగుడిలోకి వెళ్లలేదు. అనంతరం ప్రెస్‌మీట్లో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.
News January 14, 2025
మా వాళ్లను విడుదల చేయండి.. రష్యాను కోరిన భారత్
రష్యా సైన్యంలో పనిచేస్తున్న తమ పౌరుల విడుదలను వేగవంతం చేయాలని భారత్ మరోసారి కోరింది. కేరళకు చెందిన ఓ యువకుడు ఇటీవల యుద్ధంలో మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన దురదృష్టకరమని భారత్ పేర్కొంది. కేరళ యువకుడి మృతదేహాన్ని తరలించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎంబసీ తెలిపింది. భారతీయుల తరలింపునకు రష్యా ప్రభుత్వ వర్గాలతో చర్చిస్తున్నట్టు వెల్లడించింది.