News April 4, 2025
మద్యం కుంభకోణం.. కసిరెడ్డికి షాక్

AP: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసులో సాక్షిగా హాజరుకావాలని ఇటీవల సీఐడీ కసిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సీఐడీ నోటీసులకు చట్టబద్ధత ఉందని స్పష్టం చేసింది. ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.
Similar News
News April 10, 2025
ఈ ఐదు ఆహారాలను వేడి చేసి తినకండి!

ఆహారాన్ని పలుమార్లు వేడి చేసి తినడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆలుగడ్డను వేడి చేస్తే ఇందులో ఉండే నైట్రేట్లు వికారం, వాంతులు వంటి సమస్యలకు కారణమవుతాయి. పాలకూరలో ఉండే నైట్రేట్లు, అమినో యాసిడ్‌తో కలిసి క్యాన్సర్ కారకాలుగా మారొచ్చు. మష్రూమ్స్ మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే గుండె జబ్బులొస్తాయి. కోడిగుడ్డు కూడా తాజాగానే తినాలి. టీని కూడా మళ్లీ వేడి చేసి తాగొద్దు. SHARE IT
News April 10, 2025
రైతుల కోసం కొత్త పథకం: మంత్రి తుమ్మల

TG: రైతుల కోసం ‘గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం’ పథకాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. జూన్‌లో CM రేవంత్ ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురు రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథకం కింద విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 40వేల మంది రైతులకు 2500-3500 క్వింటాళ్ల విత్తనాలను అందజేస్తామన్నారు.
News April 10, 2025
మార్కుల గొడవలో కూతురిని చంపిన తల్లికి జీవితఖైదు

పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చాయని అబద్ధం చెప్పిన కూతురిని చంపిన కేసులో తల్లికి బెంగళూరు సిటీ కోర్టు జీవితఖైదు విధించింది. తనకు సెకండ్ పీయూ ఫైనల్ పరీక్షల్లో 95% మార్కులు వచ్చాయని సాహితి తన తల్లి పద్మినితో చెప్పింది. ఆ తర్వాతి రోజే ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానని చెప్పింది. తల్లి సపోర్ట్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని కోప్పడింది. దీంతో గతేడాది ఏప్రిల్ 29న పద్మిని కోపంతో సాహితిని చంపింది.