News April 4, 2025
మద్యం కుంభకోణం.. కసిరెడ్డికి షాక్

AP: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసులో సాక్షిగా హాజరుకావాలని ఇటీవల సీఐడీ కసిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. సీఐడీ నోటీసులకు చట్టబద్ధత ఉందని స్పష్టం చేసింది. ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.
Similar News
News April 25, 2025
కలెక్షన్ల సంభవం.. 2 వారాల్లో రూ.172 కోట్లు!

హీరో అజిత్ నటించిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్లలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తమిళనాడులో విడుదలైన రెండు వారాల్లోనే రూ.172.3 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించింది.
News April 25, 2025
ఏప్రిల్ 25: చరిత్రలో ఈరోజు

✒ 1874: రేడియోను కనిపెట్టిన శాస్త్రవేత్త గూగ్లిల్మో మార్కోని జననం
✒ 1984: గణితశాస్త్రజ్ఞుడు ముదిగొండ విశ్వనాథం మరణం
✒ 2005: ఆధ్యాత్మిక గురువు స్వామి రంగనాథానంద మరణం(ఫొటోలో)
✒ 2005: గాయని, నటి టంగుటూరి సూర్యకుమారి మరణం
✒ 2018: రాజకీయ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి మరణం
✒ నేడు మలేరియా దినోత్సవం
News April 25, 2025
‘పహల్గామ్’ మృతుల కుటుంబాలకు జగన్ పరామర్శ

AP: పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్, చంద్రమౌళి కుటుంబాలను మాజీ సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. పార్టీపరంగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.