News May 10, 2024
రేపు సాయంత్రం నుంచి మద్యం షాప్‌లు బంద్

తెలంగాణలో రేపు సాయంత్రం నుంచి రెండు రోజులపాటు వైన్ షాప్‌లు బంద్ కానున్నాయి. పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రేపు సా.5 నుంచి 13వ తేదీ సా.6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
Similar News
News March 29, 2026
పవర్ఫుల్ లీడర్స్: 13వ ప్లేస్‌లో CBN, 25వ ప్లేస్‌లో రేవంత్

దేశంలో శక్తిమంతమైన 100 మంది లీడర్ల లిస్ట్‌లో వరుసగా 12వ సారి మోదీ, అమిత్ షా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ‘AP CM CBN 13వ స్థానం, TG CM రేవంత్ 25వ ప్లేస్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్(68), రామ్మోహన్ నాయుడు (90) కూడా చోటు దక్కించుకున్నారు’ అని Indian Express తెలిపింది. మరోవైపు అధికారంలో లేకపోవడంతో Ex CMలు KCR, జగన్ ఈ జాబితాలో లేరు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 9, ICC చీఫ్ జైషా 22వ స్థానంలో నిలిచారు.
News March 29, 2026
దూసుకుపోతున్న విశాఖ పోర్టు.. 9 దశాబ్దాల రికార్డు బ్రేక్!

AP: విశాఖ పోర్టు చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 362 రోజుల్లో 90.29మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేసి అత్యధిక వార్షిక రికార్డు నమోదు చేసింది. గతేడాది నమోదైన 82.62MMTను అధిగమించింది. 9 దశాబ్దాల చరిత్రలో ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. సమర్థవంతమైన నిర్వహణ, వ్యూహాత్మక ప్రణాళికలు, సిబ్బంది కృషి, భాగస్వామ్య సంస్థల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు.
News March 29, 2026
IPL: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్

ఐపీఎల్-2026లో తొలి రెండు వారాల్లో జరిగే మ్యాచులకు ధోనీ దూరమైనట్లు CSK ఇటీవల ప్రకటించింది. కానీ ఆయన ఏప్రిల్ చివరి వారం వరకూ మ్యాచులు ఆడకపోవచ్చని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన దాదాపు 6 మ్యాచులకు దూరం కానున్నట్లు టీమ్ వర్గాలు చెప్పినట్లు తెలిపాయి. కాగా CSK రేపు RR, ఏప్రిల్ 3న PBKS, 5న RCB, 11న DC, 14న KKR, 18న SRH, ఏప్రిల్ 23న MIతో తలపడనుంది.


