News May 10, 2024
రేపు సాయంత్రం నుంచి మద్యం షాప్‌లు బంద్

తెలంగాణలో రేపు సాయంత్రం నుంచి రెండు రోజులపాటు వైన్ షాప్‌లు బంద్ కానున్నాయి. పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రేపు సా.5 నుంచి 13వ తేదీ సా.6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
Similar News
News February 18, 2025
TTD అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11 కోట్ల డొనేషన్

AP: తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11 కోట్ల భారీ విరాళం అందింది. ముంబైలోని ప్రసీద్ యూనో ఫ్యామిలీ ట్రస్ట్‌కు చెందిన తుషార్ కుమార్ డొనేషన్ డీడీని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందించారు. ఈ సందర్భంగా తుషార్‌ను వెంకయ్య సన్మానించి, అభినందించారు.
News February 18, 2025
రేపటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి

AP: నంద్యాల(D) శ్రీశైలం క్షేత్రంలో రేపటి నుంచి MAR 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. రేపు ఉ.9గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా వాహన సేవలు, రథోత్సవం, రుద్రాభిషేకం, కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 23న స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున CM CBN పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
News February 18, 2025
విద్యార్థుల వద్ద కాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లు లేవు

తెలంగాణలోని ఎస్సీ సంక్షేమ గురుకులాల్లోని 40శాతం విద్యార్థులకు కాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లు లేవని గురుకుల సొసైటీ గుర్తించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 75శాతం సీట్లు ఆయా వర్గాలకు అందుబాటులో ఉన్నప్పటికీ సర్టిఫికెట్లు సమర్పించలేదని తేలింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంట్రన్స్ పరీక్షల నుంచే ఈ సర్టిఫికెట్లను తప్పనిసరి చేసింది. దీని ద్వారా అర్హులకే న్యాయం జరుగుతుందని అంచనా వేస్తోంది.