News March 24, 2024

కాసేపట్లో మద్యం దుకాణాలు బంద్

image

TG: హోలీ సందర్భంగా హైదరాబాద్‌లో వైన్ షాపులు మూతపడనున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించినా, ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించినా.. కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. నగరంలో తిరిగే వాహనాలపై కానీ, జనాలపై కానీ రంగులు చల్లకూడదని సూచించారు.

Similar News

News October 3, 2024

నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోం: Jr.NTR

image

ఇతరులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేమని Jr.NTR అన్నారు. నాగ చైతన్య-సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను పాటించాలి. సినీ పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చేయడం బాధించింది. ఇలాంటి వాటిని ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదు’ అని ట్వీట్ చేశారు.

News October 3, 2024

అమల ట్వీట్‌కు అక్కినేని అఖిల్ మద్దతు

image

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల చేసిన <<14257006>>ట్వీట్‌కు<<>> అఖిల్ స్పందించారు. ‘అమ్మ.. మీ ప్రతి మాటకు నేను మద్దతు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విషయంపై మీరు స్పందించాల్సి వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదు’ అని ట్వీట్ చేశారు.

News October 3, 2024

మంత్రి సురేఖ వ్యాఖ్యలు.. స్పందించిన హీరో నాని

image

చైతూ-సమంత విడాకులపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాని స్పందించారు. ‘తాము ఏం మాట్లాడినా తప్పించుకోవచ్చని పొలిటీషియన్లు అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీ మాటలే ఇంత బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. దీనిని అందరూ ఖండించాలి’ అని ట్వీట్ చేశారు.