News March 16, 2024
YCP MP అభ్యర్థుల జాబితా.. (1/3)
☛ అరకు – తనూజ రాణి
☛ శ్రీకాకుళం – తిలక్
☛ విజయనగరం – చంద్రశేఖర్
☛ విశాఖపట్నం – బొత్స ఝాన్సీ
☛ కాకినాడ – చలమలశెట్టి సునీల్
☛ అమలాపురం – రాపాక వరప్రసాద్
☛ రాజమండ్రి – గూడూరి శ్రీనివాసులు
☛ నరసాపురం – ఉమా బాల
☛ కర్నూలు – బీవై రామయ్య
☛ ఏలూరు – సునీల్ కుమార్ యాదవ్
Similar News
News November 22, 2024
రిజిస్ట్రేషన్ విలువల సవరింపు వాయిదా
AP: ఆస్తుల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ విలువల సవరింపును రాష్ట్ర ప్రభుత్వం జనవరికి వాయిదా వేసింది. గత ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో విలువలను పెంచగా, వాటిని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే అభివృద్ధి ప్రాతిపదికన ఇతర చోట్ల పెంచనుంది. సవరించిన విలువలను తొలుత డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తేవాలని భావించింది. కానీ విలువల నిర్ధారణకు మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో వాయిదా వేసింది.
News November 22, 2024
తెలుగు రాష్ట్రాలు గజగజ
తెలుగు రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. ఏపీలోని పాడేరు ఏజెన్సీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. మినములూరులో అత్యల్పంగా 9, అరకులో 10, పాడేరు 11 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అటు తెలంగాణలోని ఆదిలాబాద్ ఏజెన్సీలోనూ చలి చంపేస్తోంది. సిర్పూర్(యు)లో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
News November 22, 2024
STOCK MARKETS: నిన్న బేర్ పంజా.. నేడెలా ఉంటాయో!
అదానీపై US కోర్టు అభియోగాల దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న విలవిల్లాడాయి. భారీ నష్టాల్లో ముగిశాయి. ఆ ప్రభావం నేడూ ఉంటుందా అని ఇన్వెస్టర్లు సందేహిస్తున్నారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్సే అందుతున్నాయి. ఆసియా సూచీలూ జోరు ప్రదర్శిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 70 పాయింట్ల మేర పెరగడం శుభసూచకం. రష్యా ICBM దాడి ప్రభావం ఉంటుందేమో చూడాలి. మరి సెన్సెక్స్, నిఫ్టీ ఎలా ఓపెనవుతాయంటారు?