News March 16, 2024
YCP MP అభ్యర్థుల జాబితా.. (1/3)
☛ అరకు – తనూజ రాణి
☛ శ్రీకాకుళం – తిలక్
☛ విజయనగరం – చంద్రశేఖర్
☛ విశాఖపట్నం – బొత్స ఝాన్సీ
☛ కాకినాడ – చలమలశెట్టి సునీల్
☛ అమలాపురం – రాపాక వరప్రసాద్
☛ రాజమండ్రి – గూడూరి శ్రీనివాసులు
☛ నరసాపురం – ఉమా బాల
☛ కర్నూలు – బీవై రామయ్య
☛ ఏలూరు – సునీల్ కుమార్ యాదవ్
Similar News
News December 12, 2024
57 ఏళ్ల తర్వాత HYDలో సంతోష్ ఫుట్బాల్ టోర్నీ
మరో క్రీడా సంబరానికి హైదరాబాద్ సిద్ధమైంది. 1966-67లో చివరిగా భాగ్యనగరంలో సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నీ జరగ్గా, ఈ ఏడాది మళ్లీ ఆతిథ్యమివ్వనుంది. ఈ నెల 14వ తేదీ నుంచి 31 వరకు డెక్కన్ అరేనా స్టేడియంలో జరిగే ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాలకు చెందిన 37 జట్లు పాల్గొననున్నాయి. CM రేవంత్ ఢిల్లీలో తాజాగా ఈ టోర్నీ పోస్టర్ను ఆవిష్కరించారు. చరిత్రాత్మక టోర్నీకి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
News December 12, 2024
6 నెలలుగా మాయమాటలతో పబ్బం గడుపుతున్నారు: YCP
AP: కూటమి ప్రభుత్వ 6 నెలల పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని YCP ఆరోపించింది. ‘అలవికాని హామీలిచ్చి గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. జనాన్ని మాయమాటలతో గందరగోళ పర్చి 6 నెలలుగా పబ్బం గడుపుతున్నారు’ అని సూపర్-6 హామీలను డస్ట్ బిన్లో పడేసిన ఫొటోను షేర్ చేసింది. గత ఐదేళ్లుగా అమలైన పథకాలు, వ్యవస్థలన్నీ రద్దయ్యాయని పేర్కొంది.
News December 12, 2024
ప్రతి 10 లక్షల జనాభాకు 21 మంది జడ్జిలు: కేంద్రం
దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 21 మంది జడ్జిలు ఉన్నారని కేంద్రం తెలిపింది. దేశంలోని హైకోర్టులలో 368 ఖాళీలు ఉండగా గరిష్ఠంగా అలహాబాద్ హైకోర్టులో 79 ఉన్నాయని వెల్లడించింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సమాధానమిచ్చారు. జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 5,262 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు.