News November 29, 2024
పట్నం నరేందర్ రెడ్డికి స్వల్ప ఊరట

TG: లగచర్లలో అధికారులపై దాడి కేసులో కొడంగల్ మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఆయనపై ఉన్న 3 FIRలలో రెండింటిని కొట్టివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఒకే ఘటనపై 3 FIRలు నమోదు చేశారని నరేందర్రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పైనిర్ణయం తీసుకుంది. లగచర్ల కేసులో A1గా ఉన్న నరేందర్రెడ్డి ప్రస్తుతం రిమాండులో ఉన్నారు.
Similar News
News December 6, 2025
కోళ్లలో కొక్కెర వ్యాధి లక్షణాలు

కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. గుడ్లు పెట్టడం తగ్గిపోతుంది. శ్వాస సమయంలో శబ్దం, నోరు తెరిచి గాలి తీసుకోవడం కనిపిస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. మేత తీసుకోవు. కోళ్లన్నీ బాగా నీరసించి పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3 నుంచి 4 రోజుల్లో మరణిస్తాయి.
News December 6, 2025
ఒక కాకి చనిపోతే మిగిలినవి ఎందుకు వస్తాయో తెలుసా?

సాధారణంగా ఒక కాకి చనిపోతే మిగిలినవి దాని చుట్టూ చేరి అరుస్తూ ఉంటాయి. కాకుల గుంపు కాకి మృతికి గల కారణాన్ని గమనించి.. ఆ ప్రాంతంలో ఉన్న ప్రమాదాన్ని అంచనా వేస్తాయి. ప్రమాదకరమైన మనిషి లేదా ప్రదేశాన్ని గుర్తుంచుకుని భవిష్యత్తులో జాగ్రత్త పడతాయి. సింపుల్గా చెప్పాలంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయి. ఈ విధంగా తమ వంశాన్ని రక్షించుకుంటాయి. కాకి వస్తే ఎవరో చనిపోతారనేది మూఢనమ్మకం అని పరిశోధనలు చెబుతున్నాయి.
News December 6, 2025
త్వరలో హీరో సుశాంత్, హీరోయిన్ మీనాక్షి పెళ్లి? క్లారిటీ..

టాలీవుడ్ హీరో సుశాంత్, హీరోయిన్ మీనాక్షి చౌదరి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు SMలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె టీమ్ ఖండించింది. ఇందులో నిజం లేదని, వారిద్దరూ ఫ్రెండ్స్ అని పేర్కొంది. ఏదైనా సమాచారం ఉంటే అఫీషియల్గా తామే ప్రకటిస్తామని తెలిపింది. కాగా సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో మీనాక్షి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలోనూ వీరి పెళ్లిపై వార్తలు రాగా మీనాక్షి ఖండించారు.


