News October 25, 2024

నేటి నుంచి పశుగణన

image

AP: నేటి నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు 21వ అఖిల భారత పశు గణన చేపట్టనున్నట్లు పశుసంవర్ధక శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 21,173 గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో పశువుల వివరాలను నమోదు చేయనున్నట్లు పేర్కొంది. గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, వివిధ రకాల కోళ్లు, పక్షులతో సహా 16రకాల పెంపుడు జంతువులపై జాతుల వారీగా సమాచారాన్ని సేకరించనుంది. పశు గణనను ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు.

Similar News

News October 25, 2024

INDvsNZ: కష్టాల్లో టీమ్ ఇండియా

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే రెండు వికెట్లు కోల్పోయింది. 56 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్ డకౌట్ కాగా గిల్(30), కోహ్లీ(1) నిరాశపర్చారు. క్రీజులో జైస్వాల్(26), పంత్(4) ఉన్నారు. భారత్ ఇంకా 203 రన్స్ వెనకబడి ఉంది. ప్రస్తుత స్కోర్ 61/3.

News October 25, 2024

INDvsNZ: గిల్ ఔట్

image

గాయం కారణంగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఆడలేకపోయిన భారత బ్యాటర్ గిల్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. 72 బంతులు ఎదుర్కొని 30 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్‌లో LBW రూపంలో పెవిలియన్ చేరారు. భారత్ ప్రస్తుతం 50/2గా ఉంది. క్రీజులో జైస్వాల్(20), కోహ్లీ(0) క్రీజులో ఉన్నారు. KL.రాహుల్ స్థానంలో గిల్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.

News October 25, 2024

STOCK MARKETS: మార్కెట్లు విలవిల.. ఇన్వెస్టర్లు లబోదిబో

image

దేశీయ స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. వరుసగా ఐదో సెషన్లోనూ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడం, జియో పొలిటికల్ సిచ్యువేషన్, US ఎన్నికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. నగదు అట్టిపెట్టుకొనేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 79,701 (-363), నిఫ్టీ 24,277 (-122) వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీలో INDUSIND BANK 15% క్రాష్ అయింది.